
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ప్రజాప్రతినిధిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఆయన, ఇప్పటికే అనేక మందికి ఆర్థికంగా సహాయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారి అభిమాని కోరికను తీర్చడమే కాకుండా, అతని కుటుంబానికి కూడా అండగా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. వరంగల్ జిల్లా హనుమకొండకి చెందిన నిరంజన్ అనే చిన్నారి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన నిరంజన్ ఆయన్ను కలవాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. అతను పవర్ స్టార్ కు ఎంత అభిమాని అంటే.. చుట్టుపక్కల వారు అతన్ని "గబ్బర్ సింగ్" అని పిలుస్తారని, ఎలాగైనా ఒకసారి పవన్ కళ్యాణ్‌ను ప్రత్యక్షంగా కలవాలని కోరుకుంటున్నాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ విషయం జనసేన నాయకుల ద్వారా పవన్ కళ్యాణ్ దృష్టికి చేరింది. స్పందించిన పవన్ కళ్యాణ్, నిరంజన్ను స్వయంగా కలుసుకుని అతని కోరికను నెరవేర్చారు. చిన్నారితో ఆప్యాయంగా మాట్లాడిన ఆయన, ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. నిరంజన్‌తో పాటు కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి ధైర్యం చెప్పారు. చిన్నారి అభిమానిని పరామర్శించడంతో పాటు.. కష్టాల్లో ఉన్న ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. తక్షణం రూ.1 లక్ష ఆర్థిక సాయాన్ని అందజేశారు. కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు నిరంజన్ తల్లికి ఒక క్యాంటీన్ ఏర్పాటు చేసి ఇస్తానని కూడా చెప్పారు. అలాగే నిరంజన్ అక్క విద్యాభ్యాసానికి అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ భరోసాతో నిరంజన్ ఫ్యామిలీ ఎమోషనల్ అయ్యారు. తమ కష్టకాలంలో అండగా నిలిచినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారి కోరికను నెరవేర్చడమే కాకుండా కుటుంబ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి సహాయం చేయడం పట్ల స్థానికులు ప్రశంసలు వ్యక్తం