విమర్శలకు భయపడేది లేదంటున్నారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత . అనితను ఉద్దేశించి మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ అంశంపై టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ రగడ జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో జరిగిన ఎన్డీఏ కూటమి విజయోత్సవ కార్యక్రమానికి మంత్రి అనిత హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నక్కపల్లి మండలం దొడ్డిగల్లు జంక్షన్ నుంచి వేంపాడు టోల్ ప్లాజా ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారతి కన్వెన్షన్‌లో సభ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న హోం మంత్రి.. సభకు హాజరై ప్రసంగించారు. ప్రజలకు సేవ చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్న వంగలపూడి అనిత.. ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయోత్సవ సభల ద్వారా ప్రజలకు వివరిస్తున్నామన్నారు. 2013 వరకు తానో సాధారణ టీచర్‌నని.. తనకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదన్నారు. తాను చదువుకున్న చదువు కారణంగానే సీటు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. 2014-19 మధ్యన పాయకరావుపేట ఎమ్మెల్యేగా నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. 2019 నుంచి 2024 సమయంలో ఎన్నో పోరాటాలు చేశామన్నారు. పాయకరావుపేట చరిత్రలో ఎన్నడు లేని విధంగా 47 వేల మెజార్టీతో ఇక్కడి ప్రజలు తనను గెలిపించారని.. నియోజకవర్గం అభివృద్దే తన లక్ష్యమని స్పష్టం చేశారు. పాయకరావుపేట ప్రజల ఆశీర్వాదం వలనే మంత్రినయ్యాయని.. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా, ఎల్లప్పుడూ నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఆలోచిస్తానని అనిత స్పష్టం చేశారు. రెండేళ్లలో పాయకరావుపేట నియోజకవర్గంలో సుమారు 650 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని.. త్వరలోనే పందూరు వంతెనను కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు. సోమిదేపల్లి గ్రామానికి రూ.9 కోట్లతో రిటర్నింగ్ వాల్ నిర్మాణం, అణుకు గిరిజన గ్రామానికి రూ.3 కోట్లతో రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అడ్డరోడ్డు కేంద్రంగా రెవిన్యూ డివిజన్ తెచ్చామని.. స్టీల్ ప్లాంట్ నిర్మాణం
Actor ProfilePolitician
చిన్నపిల్లలకు పౌడర్ రాస్తాం.. దాన్ని కూడా మేకప్ అంటారా ? వంగలపూడి అనిత
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•19 Jun 2026
చిన్నపిల్లలకు పౌడర్ రాస్తాం.. దాన్ని కూడా మేకప్ అంటారా ? వంగలపూడి అనిత