చైనాకే చుక్కలు చూపిస్తున్న కిమ్.. డ్రాగన్ కు డబుల్ డోస్
Actor ProfilePolitician

చైనాకే చుక్కలు చూపిస్తున్న కిమ్.. డ్రాగన్ కు డబుల్ డోస్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చైనాకే చుక్కలు చూపిస్తున్న కిమ్.. డ్రాగన్ కు డబుల్ డోస్
Sakshi6 Sept 2026
చైనాకే చుక్కలు చూపిస్తున్న కిమ్.. డ్రాగన్ కు డబుల్ డోస్

అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. అలాగని శాశ్వత మిత్రులూ ఉండరు. కేవలం స్వార్థ ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. దీనికి చక్కటి ఉదాహరణగా.. ఇప్పుడు తూర్పు ఆసియాలో నడుస్తున్న హైడ్రామాను చెప్పుకోవచ్చు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. ఇటీవల హఠాత్తుగా ఉత్తర కొరియాలో ల్యాండ్ అయ్యారు. ప్రపంచ మీడియా అంతా ఇప్పుడు ప్యాంగ్యాంగ్ వైపే చూస్తోంది. ఎందుకంటే, నిన్న మొన్నటి వరకు ఉత్తర కొరియా అంటే చైనాకు ఒక చిన్న ‘తోక దేశం’ లాంటిది. బీజింగ్ గీసిన గీతను కిమ్ సామ్రాజ్యం దాటదు అనేది ఒక అంచనా. కానీ.. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కథ పూర్తిగా రివర్స్ అయింది! చైనా చేతిలో రిమోట్ పనిచేయట్లేదా? ఒకప్పుడు చైనా చేతిలో రిమోట్ కంట్రోల్‌లా ఉన్న ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్.. ఇప్పుడు ఏకంగా చైనాకే ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అటు రష్యాతో గుట్టుగా నడిపిన ఆయుధాల బేరం.. ఇటు అమెరికాను ముప్పుతిప్పలు పెడుతున్న వైనం.. వీటన్నిటి మధ్య చైనా అసహనం..! అసలు కిమ్ జోంగ్ ఉన్ ఆడుతున్న ఈ గ్లోబల్ మైండ్ గేమ్ ఏంటి? చైనా-రష్యాల మధ్య ఉత్తర కొరియా ఎలా నలిగిపోతోంది? లేక ఇద్దరినీ వాడుకుంటోందా? అనే ప్రశ్నలు అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తున్నాయి. జుచే నుంచి హత్యల వరకు.. ఈ గ్లోబల్ ఈక్వేషన్ అర్థం కావాలంటే.. మనం కొంచెం చరిత్ర పేజీల్లో వెనక్కి వెళ్లాలి. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు, కిమ్ జోంగ్ ఉన్ తాత అయిన కిమ్ ఇల్ సంగ్.. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌తో పోరాడిన గట్టి మిలిటరీ లీడర్. ఆయన దేశాన్ని ఏర్పాటు చేశాక 'జుచే' (Juche) అనే ఒక వింత సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. జుచే అంటే.. ‘స్వయం సమృద్ధి’ అని అర్థం. అంటే.. ఎవరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా బతకడం, అభివృద్ధి చెందడం. దాంతో.. ప్రపంచమంతా ఇండస్ట్రియల్ ఏజ్‌లో దూసుకుపోతుంటే.. ఉత్తర కొరియా మాత్రం ఒక