చంద్రబాబు ప్రభుత్వానికి డీఎస్సీ బాధితుల సవాల్
Actor ProfilePolitician

చంద్రబాబు ప్రభుత్వానికి డీఎస్సీ బాధితుల సవాల్

Total News1
Movie Updates0
Sources1
చంద్రబాబు ప్రభుత్వానికి డీఎస్సీ బాధితుల సవాల్
Sakshi14 Jun 2026
చంద్రబాబు ప్రభుత్వానికి డీఎస్సీ బాధితుల సవాల్

సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వానికి డీఎస్సీ బాధితుల సవాల్‌ విసిరారు. కూటమి ప్రభుత్వంతో ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఇవాళ(ఆదివారం, జూన్‌ 14) వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి వచ్చిన డీఎస్సీ బాధితులు.. టీడీపీ నేతలు ఫేక్‌ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడా కోటా పేరుతో జరిగిన అక్రమాలను బాధితులు వివరించారు. అధికారులు చెప్పేవన్ని అబద్ధాలేనని మండిపడ్డారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో అవకతకవలు జరిగాయని.. డీఎస్సీలో జరిగిన అవినీతిపై వైఎస్సార్‌సీపీ గట్టిగా నిలదీస్తుందన్నారు. యువత భవిష్యత్‌తో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆయన మండిపడ్డారు. బెదిరింపులను అడ్డుకోవడానికి అండగా ఉంటామని.. అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని సజ్జల డిమాండ్‌ చేశారు. ‘‘డీఎస్సీలో కుట్ర పూరితంగా వ్యవహరించారు. విద్యాశాఖ మంత్రి తప్పు ఒప్పుకుని సీబీఐ విచారణ జరిపించాలి. డీఎస్సీ రాసి క్వాలిఫై అయితేనే ఉద్యోగం ఇవ్వాలి. డీఎస్సీ అభ్యర్థుల పోరాటంలో న్యాయ సహాయం అందిస్తాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్‌ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు) కుమార్తె గ్రాడ్యుయేషన్ డేలో హీరోయిన్ లయ (ఫొటోలు) Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 14- 21) మూడు ముళ్ల బంధానికి పద్నాలుగేళ్లు..ముచ్చటగా ముగ్గురు పిల్లలు (ఫోటోలు) కెప్టెన్ అవ్వగానే రేంజ్ మారింది.. ముంబైలో శ్రేయస్ ఇంటి అద్దె తెలిస్తే షాక్ అవ్వాల్సిందే తల్లికి ఎగనామం.. బిడ్డలకు పంగనామం.. చేతులెత్తేసిన చంద్రబాబు