చిత్తుగా ఓడిన పాకిస్తాన్ .. సెమీస్ కు ఆస్ట్రేలియా
Actor ProfilePolitician

చిత్తుగా ఓడిన పాకిస్తాన్ .. సెమీస్ కు ఆస్ట్రేలియా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చిత్తుగా ఓడిన పాకిస్తాన్ .. సెమీస్ కు ఆస్ట్రేలియా
Sakshi11 Jul 2026
చిత్తుగా ఓడిన పాకిస్తాన్ .. సెమీస్ కు ఆస్ట్రేలియా

ఐసీసీ మ‌హిళ‌ల‌ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్తాన్ వ‌రుస‌గా నాలుగో ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. ఇప్ప‌టికే టోర్నీ నుంచి నిష్క్ర‌మించిన పాకిస్తాన్ గ్రూప్‌-ఏలో మంగ‌ళ‌వారం ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. 200 ప‌రుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన పాకిస్తాన్ 13.4 ఓవ‌ర్ల‌లో 86 ప‌రుగుల‌కే కుప్ప‌కూల‌డంతో ఆస్ట్రేలియా 113 ప‌రుగుల తేడాతో భారీ విజ‌యాన్ని అందుకుంది. పాక్ బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ మునీబా అలీ (32) టాప్ స్కోర‌ర్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో సోఫీ, స‌ద‌ర్లాండ్‌, ఎలిస్ పెర్రీలు త‌లా రెండు వికెట్లు తీశారు. అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 199 ప‌రుగులు చేసింది. ఎలిస్ పెర్రీ (79) అర్ధ‌శ‌త‌కంతో రాణించ‌గా, జార్జియా వోల్ (39), స‌ద‌ర్లాండ్ (27), నికోలా కేరీ (26 నాటౌట్‌) రాణించారు. పాక్ బౌల‌ర్లలో సాదియా ఇక్బాల్‌, ర‌మీన్ ష‌మీమ్‌, న‌ష్రా సంధూ త‌లా రెండు వికెట్లు తీశారు. ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టిన ఎలీస్ పెర్రీ 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకుంది. పాక్‌పై విజ‌యంతో ఆస్ట్రేలియా నాకౌట్‌లో అడుగుపెట్టింది. మ‌రో బెర్తు కోసం భార‌త్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌ల మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొంది. గురువారం భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు బంగ్లాదేశ్ జ‌ట్టుతో కీల‌క మ్యాచ్ ఆడ‌నుంది. 'పెద్ది' మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్.. చిరు-చరణ్ స్పెషల్ మూమెంట్స్ (ఫొటోలు) హైదరాబాద్ : హుస్సేన్‌సాగర్‌లో హైలెస్సో! ఫొటోలు) మా ఇంటి బంగారం టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు (ఫొటోలు) ఢిల్లీలో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు) దద్దరిల్లిన తమిళ్ అసెంబ్లీ.. విజయ్ Vs ఉదయ్ నోటి దూల తగ్గించుకుంటే మంచిది.. నానాజీపై పవన్ సీరియస్ సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సాక్ష్యాలు ఎలా మాయం చేసారంటే... నువ్వు ఎవడైతే నాకేంటి.. ఈడ్చికొచ్చి జైల్లో వేయాలి..!? అడ్వకేట్ బాలా సీరియస్