
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Chiranjeevi Ram Charan Records in Same Year 2026: చిరంజీవి కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన రామ్ చరణ్.. తండ్రి తగ్గ తనయుడిగా సత్తా చాటుతున్నాడు. అంతేకాదు యాక్టింగ్ విషయంలో చిరంజీవిని బీట్ చేస్తున్నాడు. తాజాగా ‘పెద్ది’ సినిమాతో పలు రికార్డులను తిరగరాస్తున్నాడు రామ్ చరణ్. ఆ సంగతి పక్కన పెడితే.. భారతీయ చిత్ర పరిశ్రమలో ఎన్నో లెజండరీ ఫ్యామిలీస్ ఉన్నాయి. సక్సెస్‌ఫుల్ జనరేషన్స్ ఉన్నాయి. ఒకే కుటుంబం నుంచి పలువురు స్టార్ హీరోలు వచ్చారు. కానీ ఒకే కాలండర్ ఇయర్‌లో భారతీయ సినీ చరిత్రలో తండ్రీ కొడుకులు ఇద్దరు బాక్సాఫీస్‌ను రఫ్పాడించిన సందర్భాలు లేవు. తాజాగా ఒకే యేడాది బాక్సాఫీస్‌ను రఫ్పాడించిన హీరోలుగా రికార్డులు క్రియేట్ చేశారు చిరంజీవి, రామ్ చరణ్‌లు. ఈ యేడాది సంక్రాంతి సీజన్‌లో చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకర వర్ ప్రసాద్ గారు’ సినిమా దాదాపు రూ. 304 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. 2024లో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి భారతీయ చిత్రంగా.. తొలి సౌత్ ఇండియన్ మూవీగా కూడా రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా జూన్ నెలలో విడుదలైన ‘పెద్ది’ సినిమా దాదాపు రూ. 192 కోట్ల షేర్ (రూ.325 కోట్ల గ్రాస్)వసూళ్లను రాబట్టి సంచలనం క్రియేట్ చేసింది. అంతేకాదు సౌత్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా ప్రస్తుతానికి రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ఒకే కాలండర్ ఇయర్‌లో చిరంజీవి, రామ్ చరణ్ రికార్డ్స్