చమురు కోసం భారత్ సముద్ర మంథన్
Actor ProfilePolitician

చమురు కోసం భారత్ సముద్ర మంథన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చమురు కోసం భారత్ సముద్ర మంథన్
Andhra Jyothy3 Jul 2026
చమురు కోసం భారత్ సముద్ర మంథన్

సముద్ర జలాల్లో భారీగా అన్వేషణకు సిద్ధం గుదిబండలా మారిన క్రూడ్‌ దిగుమతులు రూ.13.50 లక్షల కోట్లకు చేరిన దిగుమతి బిల్లు న్యూఢిల్లీ: దేశంలో చమురు వినియోగం ఏటికేటికీ పెరిగిపోతోంది. డిమాండ్‌కు తగ్గట్టు దేశీయ ఉత్పత్తి పెరగడం లేదు. ఫలితంగా దేశీయ అవసరాల్లో 85 శాతం ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం పెద్దఎత్తున విదేశీ మారక ద్రవ్యం ఖర్చు చేయాల్సి వస్తోంది. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ముడి చమురు, ఎల్‌ఎన్‌జీ, ఎల్‌పీజీ వంటి పెట్రో ఉత్పత్తుల దిగుమతుల కోసం మన దేశం 14,270 కోట్ల డాలర్లు (సుమారు రూ.13.50 లక్షల కోట్లు) ఖర్చు చేయాల్సి వచ్చింది. మరో పాతికేళ్లలో ఈ బిల్లు 30,000 కోట్ల డాలర్లకు ఎగబాకే అవకాశం ఉందని బ్రోకరేజీ సంస్థ కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ అంచనా వేస్తోంది. దీంతో భారత ప్రభుత్వం సముద్ర మంథన్‌ పేరుతో దేశీయంగా చమురు, గ్యాస్‌ను ఉత్పత్తిని పెంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రానున్న నెల రోజుల్లో దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. సరఫరా ఆటంకాలు ఒకవైపు చమురు దిగుమతి బిల్లు పెరిగిపోతోంది. మరోవైపు ఎలాంటి అంతర్జాతీయ ఉద్రిక్తతలు లేదా సంక్షోభం ఏర్పడినా.. ఆ ప్రభావం చమురు దిగుమతులపై పడుతోంది. పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో గత మూడు నెలలుగా హోర్ముజ్‌ జలసంధి మూసుకుపోయింది. దీంతో భారత్‌తో పాటు అనేక దేశాలకు చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. యుద్ధానికి ముందు బ్యారల్‌ 60-65 డాలర్ల మధ్య ట్రేడైన చమురు ధర ఒక దశలో 130 డాలర్లకు ఎగబాకింది. ప్రస్తుతం అమెరికా-ఇరాన్‌ శాంతి చర్చలతో కొద్దిగా ఉపశమించినా, ఇప్పటికీ చమురు ధర యుద్ధానికి ముందున్న ధర కంటే అధిక ధర వద్దే ట్రేడవుతోంది. సముద్ర మధనమే ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభంతో ఇంధన భద్రత ఎంత అవసరమో ప్రభుత్వానికి తెలిసి వచ్చింది. దీంతో ప్రైవేటు సంస్థలను కూడా ప్రోత్సహించటం ద్వారా దేశీయంగా చమురు

చమ ర క స భ రత సమ ద ర మ థన Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in