చనిపోయినా ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన భాగ్యరాజ్.. కళ్లను దానం చేసి ఆదర్శంగా నిలిచిన నటుడు
Actor ProfileActor

చనిపోయినా ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన భాగ్యరాజ్.. కళ్లను దానం చేసి ఆదర్శంగా నిలిచిన నటుడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చనిపోయినా ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన భాగ్యరాజ్.. కళ్లను దానం చేసి ఆదర్శంగా నిలిచిన నటుడు
TV9 Telugu8 Aug 2026
చనిపోయినా ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన భాగ్యరాజ్.. కళ్లను దానం చేసి ఆదర్శంగా నిలిచిన నటుడు

తమిళ సినిమా దర్శకుడు, నటుడు, స్క్రీన్ రైటర్ కె. భాగ్యరాజ్ (73) శనివారం (జూన్ 27 ) చెన్నైలో తీవ్ర గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. వైవిధ్యమైన సినిమాలు, విలక్షణమైన నటనతో దక్షిణాది చిత్ర పరిశ్రమలో 'స్క్రీన్ ప్లే కింగ్' గా గా గుర్తింపు పొందిన భాగ్యరాజ్ మరణం చిత్ర పరిశ్రమకు అలాగే కోట్లాది మంది అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. సీఎం విజయ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు భాగ్యరాజ్ ఇంటికి చేరుకుని ఆయనకు నివాళులు అర్పించాడు. నటుడితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే మరణానంతరం కూడా తన గొప్ప మనసును చాటుకున్నారు భాగ్యరాజ్. ఆయన కన్నుమూసిన కొన్ని గంటల్లోనే కుటుంబ సభ్యులు భాగ్యరాజ్ నేత్రాలను దానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. దాదాపు దశాబ్దాల క్రితమే తాను మరణించిన తర్వాత కళ్లు దానం చేస్తానని భాగ్యరాజ్ ప్రతిజ్ఞ చేశారు. ఆ మాటను నిలబెడుతూ ఆయన కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని ప్రముఖ కంటి ఆసుపత్రికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే నిపుణులైన వైద్యుల బృందం భాగ్యరాజ్ నివాసానికి చేరుకుని, నిర్దేశిత సమయంలోగా ఆయన నేత్రాలను అత్యంత భద్రంగా సేకరించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు భాగ్యరాజ్ రియల్ హీరో అంటూ ప్రశంసిస్తున్నారు. కాగా భాగ్యరాజ్ నివాసానికి వెళ్లి తుది నివాళులర్పించిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తన ట్విట్టర్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు. 'కె. భాగ్యరాజ్‌కు తుది నివాళులర్పించడానికి వెళ్ళినప్పుడు, ఆయన తన కళ్లను దానం చేశారని నాకు తెలిసింది. మరణానంతరం కూడా ఒకరి జీవితంలో వెలుగులు నింపాలనే ఆయన ఆలోచనను ఎంత పొగిడినా తక్కువే. ప్రజా జీవితంలో గుర్తింపు పొందిన ఇంతటి ప్రముఖులు తమ కళ్లను దానం చేసినప్పుడు, అది ప్రజలలో గొప్ప అవగాహనను కల్పిస్తుంది' అని నటుడికి నివాళి అర్పించారు తమిళి సై. కాగా భాగ్యరాజ్‌కు భార్య పూర్ణిమ

చన ప య న ఇద దర జ వ త ల ల వ ల గ ల న ప న భ గ యర జ కళ లన ద న చ స ఆదర శ గ న ల చ న నట డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in