ఘనంగా యంగ్ ఇండియా వెల్కమ్ కిట్స్ పంపిణీ కార్యక్రమం
Actor ProfilePolitician

ఘనంగా యంగ్ ఇండియా వెల్కమ్ కిట్స్ పంపిణీ కార్యక్రమం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఘనంగా యంగ్ ఇండియా వెల్కమ్ కిట్స్ పంపిణీ కార్యక్రమం
Andhra Jyothy19 Jun 2026
ఘనంగా యంగ్ ఇండియా వెల్కమ్ కిట్స్ పంపిణీ కార్యక్రమం

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా వెల్కమ్ కిట్స్ పంపిణీ, డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా వెల్కమ్ కిట్స్ పంపిణీ, డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించడంతో పాటు కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా రూ.50.73కోట్లతో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారు. అందులో రూ.36.65కోట్లతో వివిధ జిల్లాల్లో మినీ స్టేడియాల నిర్మాణం, క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. రూ.14.08కోట్లతో గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియాల్లో బాలబాలికల క్రీడా శిక్షణకు వివిధ అకాడమీలను రేవంత్ ప్రారంభించారు. రూ.10కోట్లతో రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌లో మినీ స్టేడియం నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.10కోట్లతో సంగారెడ్డిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియం ఆధునికీకరణకు కొబ్బరికాయ కొట్టారు. అలాగే రూ.4కోట్లతో నారాయణపేట్ జిల్లా నర్వలో మినీ స్టేడియం నిర్మాణానికి భూమిపూజ చేశారు. రూ.4కోట్లతో వనపర్తి జిల్లా ఆత్మకూర్‌లో మల్టీ పర్పస్ స్టేడియం, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో కోర్టుల నిర్మాణం, క్రికెట్ గ్రౌండ్, వాకింగ్ ట్రాక్ అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. అలాగే రూ.3.50కోట్లతో కామారెడ్డి జిల్లా గాంధారి, రూ.2.65కోట్లతో మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మినీ స్టేడియాలకు భూమిపూజ చేశారు. రూ.2.50కోట్లతో నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం ఉట్కూరులో వాలీబాల్, కబడ్డీ కోర్టుల నిర్మాణానికీ కొబ్బరికాయ కొట్టారు సీఎం రేవంత్. రూ.5.70 కోట్లతో బాలికల కోసం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన FIFA AIFF తెలంగాణ టాలెంట్ అకాడమీ

ఘన గ య గ ఇ డ య వ ల కమ క ట స ప ప ణ క ర యక రమ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in