గాలివాన కారణంగా శంషాబాద్ కు రావాల్సిన పలు విమానాలు దారి మళ్లింపు
Actor ProfilePolitician

గాలివాన కారణంగా శంషాబాద్ కు రావాల్సిన పలు విమానాలు దారి మళ్లింపు

Total News1
Movie Updates0
Sources1
గాలివాన కారణంగా శంషాబాద్ కు రావాల్సిన పలు విమానాలు దారి మళ్లింపు
Vaartha13 Jun 2026
గాలివాన కారణంగా శంషాబాద్ కు రావాల్సిన పలు విమానాలు దారి మళ్లింపు

Shamshabad Airport Updates:హైదరాబాద్ నగరంలో గత రెండు రోజులుగా వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా నగరంలోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. శుక్రవారం రాత్రి కురిసిన భారీ గాలివాన కారణంగా రన్‌వేపై విమానాల ల్యాండింగ్‌కు పరిస్థితులు అనుకూలించలేదు. తక్కువ విజిబిలిటీ కారణంగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానానికి కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) ల్యాండింగ్ అనుమతి నిరాకరించింది. Read Also : Dundigal Air Force Academy : దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ పెరేడ్ లో పాల్గొన్నరాజ్నాథ్ ఢిల్లీ పర్యటన ముగించుకుని శుక్రవారం రాత్రి హైదరాబాద్ వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమానానికి శంషాబాద్‌లో ల్యాండింగ్ అనుమతి దక్కలేదు. వాతావరణం అత్యంత ప్రతికూలంగా ఉండటంతో భద్రతా కారణాల దృష్ట్యా పైలట్లు సీఎం విమానాన్ని బెంగళూరుకు తరలించారు. కేవలం ముఖ్యమంత్రి విమానమే కాకుండా ఢిల్లీ, ముంబయి సహా పలు ప్రాంతాల నుంచి వచ్చిన మరికొన్ని విమానాలను కూడా అధికారులు ఇతర నగరాలకు దారిమళ్లించారు. శనివారం కూడా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు పరిస్థితులు అనుకూలంగా లేవని అధికారులు వెల్లడించారు. దట్టమైన మబ్బులు, ఈదురుగాలుల కారణంగా పలు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయగా.. గాల్లో ఉన్న మరికొన్ని విమానాలను అత్యవసరంగా ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. వీటిలో ఎయిరిండియా, స్పైస్‌జెట్, ఇండిగోకు చెందిన డొమెస్టిక్ఇంటర్నేషనల్ సర్వీసులు ఉన్నాయి. దారి మళ్లించిన విమానాల పూర్తి వివరాలు ఇవే: AP Rain Update : ఏపీలో రుతుపవనాల జోరు: పలు జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్ గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Hyderabad Rain Alert: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీ వర్ష సూచన! Drug manufacturing