
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5 నిర్మాణ సంస్థ :తథాస్తు క్రియేషన్స్ నటీనటులు: ఆకాష్, భైరవి ఆర్థ్యా, రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి, సిద్ధు, మహేందర్, ఐశ్వర్య, మహేందర్ డి.డి. శ్రీనివాస్, కిట్టయ్య తదితరులు సంగీతం: యశ్వంత్ నాగ్, సినిమాటోగ్రఫీ : జవహర్ రెడ్డి మరియు సుమంత్ కచర్ల కొరియోగ్రాఫర్: చంద్రకిరణ్ నిర్మాత: తాటి బాలకృష్ణ దర్శకత్వం: శివ కేసనకుర్తి విడుదల తేది :12.06.2026 ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు హీరోగా నటించిన రెండో చిత్రం ‘కొత్త మలుపు’. దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి తెరకెక్కించిన ఈ చిత్రం కోనసీమ నేపథ్యంలో రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా (జూన్ 12న) థియేటర్‌లలో విడుదలైంది. ప్రేమలో అపార్థాలకు చెక్ పెడుతూ… మనసులను తాకే ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ అని చిత్రయూనిట్ చెప్పినట్టే ఈ సినిమా ఉందా? ఈ మూవీ రివ్యూ తెలుసుకుందాం. కథ: జీవితాన్ని ఎంజాయ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లో హ్యాపీగా గడిపే యువకుడు కమల్ (ఆకాష్ గోపరాజు ). ఓ కుటుంబ వివాహ వేడుక కోసం తూర్పు గోదావరి జిల్లాలోని అందమైన గ్రామానికి వెళ్తాడు. అక్కడ వరలక్ష్మి (భైరవి ఆర్థ్యా) అనే గ్రామీణ యువతిని చూసి ఆకర్షితుడవుతాడు. ఒక రాత్రి అనుకోని పరిస్థితుల్లో అవమానకర స్థితిలో చిక్కుకున్న కమల్‌ను ఓ యువతి కాపాడుతుంది. అయితే ఆమె ఎవరో తెలియదు. తనను ఆదుకున్న ఆ అమ్మాయి కోసం కమల్ చేసే అన్వేషణలో వరలక్ష్మి అతనికి తోడుగా నిలుస్తుంది. ఈ ప్రయాణంలో ఇద్దరి మధ్య ప్రేమ మొలకెత్తుతుంది. అయితే, తాను వెతుకుతున్న అమ్మాయి వరలక్ష్మినేనని తెలుసుకునేలోపే, ఆమె మరో యువకుడితో ఉన్న ఫోటో కమల్ చేతికి చిక్కుతుంది. దాంతో ప్రేమలో అనుమానాలు, అపార్థాలు చోటుచేసుకుంటాయి. ఆ యువకుడు ఎవరు? వరలక్ష్మికి అతనితో సంబంధం ఏమిటి? ఈ అపార్థాల మధ్య కమల్-వరలక్ష్మి ప్రేమ ఎలాంటి పరీక్షలు