గ్రూపులకే ఫుల్ డిమాండ్! వెబ్ ఆప్షన్లు షురూ
Actor ProfilePolitician

గ్రూపులకే ఫుల్ డిమాండ్! వెబ్ ఆప్షన్లు షురూ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గ్రూపులకే ఫుల్ డిమాండ్! వెబ్ ఆప్షన్లు షురూ
Oneindia Telugu19 Jul 2026
గ్రూపులకే ఫుల్ డిమాండ్! వెబ్ ఆప్షన్లు షురూ

తెలంగాణలో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అత్యంత కీలకమైన ఘట్టం ప్రారంభమైంది. ఎప్‌సెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ నేటి (గురువారం) నుండి జులై 1వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ ఏడాది కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటాతో పాటు ఈడబ్ల్యూఎస్‌ (EWS) సీట్లను కలుపుకొని మొత్తం 89,252 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన వెల్లడించారు.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 175 ఇంజినీరింగ్ కళాశాలలు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నాయి. ఇందులో 22 వర్సిటీ కళాశాలలు, 2 ప్రైవేట్ వర్సిటీలు, 151 ప్రైవేట్ అనుబంధ కాలేజీలు ఉన్నాయి. మేనేజ్‌మెంట్ కోటాతో కలిపి రాష్ట్రంలో మొత్తం బీటెక్ సీట్ల సంఖ్య 1,21,639గా ఉంది. కాగా, టాప్ 1000 ర్యాంకర్లలో కేవలం 182 మంది మాత్రమే ఐఐటీ, ఎన్‌ఐటీలపై మొగ్గు చూపుతూ రాష్ట్ర కౌన్సెలింగ్‌లో స్లాట్ బుక్ చేసుకోవడం గమనార్హం.బ్రాంచీల వారీగా కన్వీనర్ కోటా సీట్ల వివరాలు (EWS కాకుండా)..ఈ ఏడాది కూడా విద్యార్థుల మొదటి ఛాయిస్ కంప్యూటర్ సైన్స్ గ్రూపులేనని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కన్వీనర్ కోటాలో ప్రధాన బ్రాంచీల వారీగా అందుబాటులో ఉన్న సీట్లు ఇలా ఉన్నాయి:సీఎస్‌ఈ (CSE): 27,431 సీట్లుసీఎస్‌ఈ - ఏఐ-ఎమ్ఎల్ (AI-ML): 13,537 సీట్లుఈసీఈ (ECE): 10,851 సీట్లుసీఎస్‌ఈ - డేటా సైన్స్: 7,479 సీట్లుఈఈఈ (EEE): 4,465 సీట్లుఐటీ (IT): 3,786 సీట్లుసివిల్ (Civil): 3,339 సీట్లుమెకానికల్ (Mechanical): 3,078 సీట్లుసీఎస్‌ఈ - సైబర్ సెక్యూరిటీ: 1,691 సీట్లుఏఐ అండ్ ఎమ్ఎల్: 1,190 సీట్లుఏఐ అండ్ డేటా సైన్స్: 1,130 సీట్లు(నోట్: ఈ సీట్లకు అదనంగా ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు ఉంటాయి. మైనారిటీ కళాశాలల్లో ఈ కోటా వర్తించదు).AP EAPCET 2026 Results: ఎంసెట్ ఫలితాలు ఆ రోజే ? తాజా అప్డేట్..!యూనివర్సిటీల వారీగా సీట్ల లభ్యత:రాష్ట్రంలోని 22 వర్సిటీ కళాశాలల్లో మొత్తం 6,046 సీట్లు అందుబాటులో ఉన్నాయి. యూనివర్సిటీల వారీగా కాలేజీలు