
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టాలని కేంద్రమంత్రికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీ, జూన్ 23: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టాలని కేంద్రమంత్రికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ స్థాపనపై చొరవ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదన చేసిన వెంటనే స్పందించి.. ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం సివిల్ ఏవియేషన్ తరఫున ఫీజిబులిటీ సర్వే చేసినందుకు రామ్మోహన్ నాయుడికి మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఫీజిబులిటీ సర్వేలో ప్రతిపాదిత స్థలం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం అనువుగా లేనందున మరో స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిపాదన చేసినట్లు చెప్పారు. అక్కడ త్వరగా ఫీజిబులిటీ సర్వే చేసి, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణంలో చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రికి తుమ్మల విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం రామాలయం దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఢిల్లీలో రేవంత్ బిజీబిజీ.. కిషన్‌రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి ఖట్టర్‌తో సమావేశం అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పురోగతిపై మంత్రి సీతక్క సమీక్ష