
Gurthukosthunnayi Web Series Review: విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు జంటగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’. 90s కిడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శరత్ చంద్ర నాయుడు నిర్మాణంలో వినోద్ గాలి దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది. గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ జులై 3 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా ముందు రోజే స్పెషల్ ప్రీమియర్ షో వేశారు. ఈ సిరీస్ లో రోహిణి హట్టంగడి, శివ నారాయణ, ప్రియదర్శిని రామ్.. పలువురు కీలక పాత్రలు పోషించారు. సంతోష్(విరాజ్)- వైశాలి(యశశ్రీరావు) చిన్నప్పట్నుంచి ప్రేమించుకుంటారు. అతి కష్టం మీద వైశాలి తండ్రి, సంతోష్ వాళ్ళ స్కూల్ ప్రిన్సిపాల్ రఘునాథ్(ప్రియదర్శిని రామ్)ని ఒప్పిస్తారు. కానీ రఘునాథ్ కొన్ని కండిషన్స్ పెడతాడు. వాటన్నిటిని సంతోష్ నెరవేర్చడంతో పెళ్ళికి ముహూర్తం పెడతారు. అయితే మొదటి పెళ్లి కార్డు మాకే ఇవ్వాలని, పెళ్లి అయ్యేదాకా ఊరు దాటి బయటకు వెళ్ళొద్దని సంతోష్ కి రఘునాథ్ కండిషన్ పెడతాడు. కానీ సంతోష్ కి తన చిన్ననాటి స్నేహితులు గుర్తొచ్చి వాళ్లందరికీ ముందే కార్డులు పోస్ట్ చేసి వారం రోజుల ముందే రమ్మంటాడు. వాళ్ళు వచ్చాక బ్యాచిలర్ పార్టీ గోవా అని హడావిడి చేయడంతో సంతోష్, అతని చిన్ననాటి బెస్ట్ ఫ్రెండ్స్ ఆనంద్(గోపి), గణేష్(వైవా రాఘవ), శ్రీకాంత్(సిద్దు పవన్) కలిసి కార్ లో గోవాకు బయలుదేరుతారు. వెళ్తుంటే దారిలో యాక్సిడెంట్ జరిగి సంతోష్ గతం మర్చిపోతాడు. అతని గతం గుర్తు చేస్తూ ఉంటే మళ్ళీ మాములు మనిషి అయ్యే ఛాన్స్ ఉందని డాక్టర్(అనీష్ కురువిళ్ళ) చెప్పడంతో ఫ్రెండ్స్ అంతా తమ చిన్ననాటి సంగతులు చెప్పుకొస్తారు. ఈ విషయం రఘునాథ్ కి, వైశాలికి తెలిస్తే ఎక్కడ పెళ్లి ఆగిపోతుందో అని భయపడి సంతోష్ ఫ్రెండ్స్, అతని పేరెంట్స్ ఎపుడూ సంతోష్ పక్కనే ఉంటూ మేనేజ్ చేస్తారు. మరి ఈ విషయం రఘునాథ్, వైశాలికి ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు?