గ్రాండ్ గా బాలయ్య
Actor ProfilePolitician

గ్రాండ్ గా బాలయ్య

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గ్రాండ్ గా బాలయ్య, కొరటాల మూవీ ఓపెనింగ్ .. ఎన్బీకే కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ .. పెద్ద
Asianet News Telugu19 Jul 2026
గ్రాండ్ గా బాలయ్య, కొరటాల మూవీ ఓపెనింగ్ .. ఎన్బీకే కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ .. పెద్ద

బాలకృష్ణ మరోసారి సినిమాల స్పీడ్‌ పెంచాడు. ఒక మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే మరో సినిమాని ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ఆయన గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఎన్బీకే 111 సినిమా చేస్తున్నారు. ఇందులో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది చిత్రీకరణ జరుపుకుంటోంది. మాఫియా బ్యాక్‌ డ్రాప్‌లో సినిమా సాగబోతుందట. ఈ క్రమంలో ఇప్పుడు మరో సినిమాని స్టార్ట్ చేశారు బాలయ్య. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా నేడు గురువారం అమరావతిలో ప్రారంభమైంది. మంత్రి నారా లోకేష్‌ చేతుల మీదుగా ఈ మూవీ ప్రారంభం కావడం విశేషం. ఆయన క్లాప్‌ ఇవ్వగా, దర్శకుడు గోపీచంద్‌ మలినేని స్క్రిప్ట్ అందించారు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం కావడం విశేషం. ఈ మూవీ రెగ్యూలర్‌ షూటింగ్‌ని ఆగస్ట్ లో ప్రారంభించనున్నట్టు నిర్మాత సుధాకర్‌ చెరుకూరి వెల్లడించారు. సుధాకర్‌ మిక్కిలినేనితో కలిసి ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై నిర్మిస్తున్నారు. ఈ మూవీ బాలయ్య మార్క్ మాస్‌, కమర్షియల్‌ ఎలిమెంట్లతో ఉంటుందట. అదే సమయంలో యాక్షన్‌ ప్రధానంగా సాగుతుందని తెలుస్తోంది. దీనికితోడు కొరటాల మార్క్ సెన్సిబులిటీస్‌, సామాజిక అంశాలు కూడా ఉంటాయని, యాక్షన్‌, సోషల్‌ ఎలిమెంట్లని మేళవింపుగా దీన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా సినిమా బడ్జెట్‌ వివరాలు షాకిస్తున్నాయి. దీన్ని సుమారు రూ.150 నుంచి రూ.200కోట్ల బడ్జెట్‌తో నిర్మించబోతున్నారట. ఇది బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌ కావడం విశేషం. ఆయనపై వంద కోట్లకు మించి బడ్జెట్‌ పెట్టేందుకు మేకర్స్ వెనకడుగు వేస్తున్నారు. గోపీచంద్‌ మలినేని మూవీని అలానే మారిపోయింది. దీనికి సుమారు రెండు వందల కోట్ల వరకు బడ్జెట్‌ అనుకున్నారు. కానీ రికవరీ కష్టం అని చెప్పి కథలో మార్పులు చేశారు. హిస్టారికల్‌ ఎలిమెంట్లని తీసేసి మాఫియా బ్యాక్‌ డ్రాప్‌లో సినిమాని తీస్తున్నారు. మరి ఇప్పుడు కొరటాల

గ ర డ గ బ లయ య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in