గ్యాప్ ఇవ్వలా.. వచ్చింది అంటున్న స్టార్ హీరోస్
Actor ProfileActor

గ్యాప్ ఇవ్వలా.. వచ్చింది అంటున్న స్టార్ హీరోస్

Total News1
Movie Updates0
Sources1
గ్యాప్ ఇవ్వలా.. వచ్చింది అంటున్న స్టార్ హీరోస్
TV9 Telugu13 Jun 2026
గ్యాప్ ఇవ్వలా.. వచ్చింది అంటున్న స్టార్ హీరోస్

సినిమా ఏదైనా కూడా మన హీరోలందరూ ఫాలో అవుతున్న రూట్ మాత్రం అదే.. కారణం ఏదైనా గానీ స్టార్స్ అంతా చేస్తున్న పనైతే అదే.. ఒకరో ఇద్దరో కాదు అందరూ అదే దారిలో వెళ్లడం కాస్త ఆశ్చర్యమే అయినా కూడా ఎవరి రీజన్స్ వాళ్లకున్నాయి. కొంరదు మేకోవర్స్ అంటున్నారు.. మరికొందరు రెస్ట్ కావాలంటున్నారు.. మరి అందరూ వెళ్తున్న ఆ దారేంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? ఈ రోజుల్లో పెద్ద సినిమా చేయాలంటే కనీసం రెండేళ్లు తీసుకుంటున్నారు హీరోలు. దానికోసం మేకోవర్ అవ్వడానికి మరో ఆర్నెళ్లు కావాలంటున్నారు. అలా ఓ సినిమా చేసాక వెంటనే మరో సినిమా సెట్‌లో అడుగు పెట్టడానికి బాగా టైమ్ తీసుకుంటున్నారు. ఈ మధ్యే పెద్దితో వచ్చిన చరణ్.. సుకుమార్ సినిమా స్టార్ట్ చేయడానికి 4 నెలలకు పైగానే టైమ్ తీసుకుంటున్నారు. పెద్ది సినిమా సెట్‌లో చరణ్ చేతికి గాయమైంది.. ఆ నొప్పితోనే నెల రోజులుగా ప్రమోషన్ చేస్తున్నారు మెగా హీరో. అయితే సినిమా విడుదలవ్వడంతో.. త్వరలోనే ఈ చేతికి సర్జరీ చేయించుకోనున్నారు చరణ్. ఈలోపు కథకు తుది మెరుగులు దిద్దనున్నారు సుకుమార్. ఇక ఆ మధ్య గుంటూరు కారం తర్వాత వారణాసి సెట్‌లో జాయిన్ అవ్వడానికి ఏడాదికి పైగానే తీసుకున్నారు మహేష్ బాబు. కథ అంతా సిద్ధమైనా ప్రీ ప్రొడక్షన్ కోసం టైమ్ తీసుకున్నారు జక్కన్న.. అందులో భాగమయ్యారు మహేష్.. అందుకే భారీ గ్యాప్ తప్పలేదు. ఇక పుష్ప 2 హ్యాంగోవర్ దిగి.. రాకా కోసం లుక్ మేకోవర్ చేయడానికి బన్నీకి ఏడాదికి పైగానే టైమ్ పట్టింది. 2024 డిసెంబర్‌లో పుష్ప 2 వస్తే.. 2025 చివర్లో అట్లీ లొకేషన్‌లో అడుగు పెట్టారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ చిత్ర షూట్ వేగంగా జరుగుతుంది. మన శంకరవరప్రసాద్ గారుతో బ్లాక్‌బస్టర్ కొట్టాక బాబీ సెట్‌లో చేరడానికి చిరంజీవికి 5 నెలల టైమ్ పట్టింది. ఈ మధ్యలో చిరు భుజానికి సర్జరీ అయింది