
ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ పండగ (FIFA World Cup 2026) ఉత్సాహాన్ని నింపుతుంటే.. ఇరాన్ దేశం మాత్రం ఒక తీరని గుండెకోతతో, కన్నీటి జ్ఞాపకాలతో మైదానంలోకి అడుగుపెట్టింది. గత ఫిబ్రవరి (2026)లో ఇరాన్‌లోని మినాబ్’ పట్టణంలో ఉన్న ఒక ప్రాథమిక పాఠశాలపై జరిగిన ఘోర క్షిపణి దాడిలో 170 మందికి పైగా అమాయక పాఠశాల పిల్లలు, ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. ఆ చిన్నారుల పవిత్ర జ్ఞాపకార్థం, వారి త్యాగాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఇరాన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు తమ టోర్నమెంట్‌కు ఒక ప్రత్యేక రూపాన్ని ఇచ్చింది. ఈ ప్రపంచకప్‌లో ఇరాన్ జట్టు మినాబ్ 168 (Minab 168) అనే పేరుతో బరిలోకి దిగింది. అంతేకాదు, తమ గుండెల్లో దాగున్న ఆవేదనకు ప్రతీకగా ఆటగాళ్లంతా తమ యూనిఫామ్‌లపై ప్రత్యేక బంగారు పిన్నులను ధరించి మైదానంలో భావోద్వేగభరితంగా నిలిచారు. ఈ ఉద్వేగభరిత ప్రస్థానంపై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘేయ్ X (ట్విట్టర్) వేదికగా ఒక గుండెలు పిండేసే లెగో-ప్రేరేపిత (Lego-inspired) వీడియోను పంచుకున్నారు. ఇరాన్ తన ఒంటిపై ఉన్న అన్ని గాయాలతోనూ ఇంకా గర్వంగా నిలబడే ఉంది. విశాలమైన ఛాతీ, అచంచలమైన సంకల్పంతో ఈ దేశ బిడ్డలు ప్రపంచ వేదికపై పోటీ పడేందుకు సిద్ధమయ్యారు. ఒక దేశం మొత్తం చేస్తున్న ప్రార్థనలు మన జాతీయ జట్టుకు తోడుగా ఉన్నాయి. ఆ చిన్నారుల కోసం, మన ఇరాన్ కోసం, మన జాతీయ జెండా రెపరెపలాడటం కోసం మనమంతా ఏకతాటిపై నిలిచి ఇరాన్ అని నినదిద్దాం. మన యువతకు విజయం, గౌరవం దక్కాలని కోరుకుందాం అంటూ ఆయన రాసుకొచ్చిన సందేశం ప్రతి ఒక్కరినీ కదిలించింది. మరణించిన ఆత్మల త్యాగాల పునాదులపైనే ఇరాన్ పట్టుదల నిర్మితమైందని ఆయన పేర్కొన్నారు. అక్షరాలపై మృత్యు తాండవం, 115 పసి ప్రాణాలు బలి!స్టేడియం వెలుపల నిరసనల హోరు..