గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో చంద్రబాబు సమావేశం
Actor ProfilePolitician

గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో చంద్రబాబు సమావేశం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో చంద్రబాబు సమావేశం
Telugu Times19 Jun 2026
గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో చంద్రబాబు సమావేశం

విజయవాడ కృష్ణలంకకు చెందిన రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ(Sai Krishna) అదృశ్యం, లాకప్ డెత్ ఆరోపణల నేపథ్యంలో ఆయన తల్లి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. సాయికృష్ణ అదృశ్యం వెనుక ఉన్న వాస్తవాలను, కృష్ణలంక(Krishna lanka) పోలీసుల తీరును కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి వివరించి కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా స్పందించిన సీఎం చంద్రబాబు.. ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటుందని పటిష్టమైన భరోసా ఇచ్చారు. సాయికృష్ణ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ఇప్పటికే ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించిందని సీఎం చంద్రబాబు(Chandrababu) ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కృష్ణలంక సీఐ నాగరాజును తక్షణమే సస్పెండ్ చేయడంతో మాత్రమే కాదని, దర్యాప్తును మరింత వేగవంతం చేశామని ఆయన పేర్కొన్నారు. చట్టాన్ని రక్షించాల్సిన వారే తప్పు చేస్తే సహించేది లేదని, ఈ కేసులో దోషులు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని విజయలక్ష్మికి స్పష్టం చేశారు. ఈ భేటీతో గాదె సాయికృష్ణ కేసులో ఏపీ ప్రభుత్వం ఎంత సీరియస్‌గా ఉందో స్పష్టమైంది. పోలీసుల కస్టడీలో అరాచకాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇవ్వడం పట్ల సామాజిక వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. బాధితురాలికి సంపూర్ణ న్యాయం జరిగేలా చూస్తామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు

గ ద స య క ష ణ తల ల వ జయలక ష మ త చ ద రబ బ సమ వ శ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in