గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు.. సీసీ ఫుటేజ్ మాయం
Actor ProfilePolitician

గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు.. సీసీ ఫుటేజ్ మాయం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు.. సీసీ ఫుటేజ్ మాయం
Andhra Jyothy4 Jul 2026
గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు.. సీసీ ఫుటేజ్ మాయం

ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఒక కీలకమైన విషయాన్ని గుర్తించారు. విజయవాడ, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో (Gade Saikrishna Missing Case) ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు ఒక కీలకమైన విషయాన్ని గుర్తించారు. ఈ కేసులో అత్యంత ప్రాధాన్యం కలిగిన సీసీటీవీ ఫుటేజ్‌ మాయమైనట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. సాయికృష్ణ అదృశ్యం ఉదంతంలో నిజానిజాలు రాబట్టేందుకు సీసీటీవీ విజువల్స్ ఎంతో కీలకంగా మారాయి. మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు (దాదాపు నెల రోజుల పాటు) ఉన్న పూర్తి సీసీ ఫుటేజ్ సిస్టమ్ నుంచి మాయమైనట్లు అధికారుల విచారణలో తేలింది. నెల రోజులకు సంబంధించిన రికార్డింగ్స్ ఉండాల్సిన చోట, కేవలం రెండు రోజులకు సంబంధించిన ఫుటేజ్‌ను మాత్రమే ఉంచి, మిగతాదంతా డిలీట్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇటీవలే ఈ కేసు విచారణ సందర్భంగా.. నెల రోజులకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను అత్యంత భద్రంగా దాచాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గాదె సాయికృష్ణ అదృశ్యం వెనుక ఎవరిదైనా హస్తం ఉందా? లేక ఇదొక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కిడ్నాపా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో అసలు నేరస్థులు ఎవరో దొరకకుండా, కీలకమైన సాక్ష్యాధారాలను పూర్తిగా రూపుమాపేందుకే ఈ నెల రోజుల సీసీ ఫుటేజ్‌ను మాయం చేసినట్లు తెలుస్తోంది. డేటా రికవరీ నిపుణుల సాయంతో డిలీట్ అయిన సీసీ ఫుటేజ్‌ను తిరిగి పునరుద్ధరించేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఫుటేజ్‌ మాయం కావడంతో ఈ కేసు విచారణలో సిట్ అధికారులు వేగం పెంచారు. ABN ఎఫెక్ట్.. ఇంద్రకీలాద్రి నకిలీ టికెట్లపై సమగ్ర విచారణకు ప్రభుత్వం