గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర.. వరుసగా 2వ రోజూ డౌన్
Actor ProfileActor

గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర.. వరుసగా 2వ రోజూ డౌన్

Total News1
Movie Updates0
Sources1
గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర.. వరుసగా 2వ రోజూ డౌన్, ఈరోజు 22, 24 క్యారెట్ల
Samayam Telugu17 Jun 2026
గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర.. వరుసగా 2వ రోజూ డౌన్, ఈరోజు 22, 24 క్యారెట్ల

అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ భారీగా తగ్గాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 11 డాలర్ల వరకు పడిపోయింది. దీంతో ఔన్స్ బంగారం ధర 4323 డాలర్ల వద్దకు దిగివచ్చింది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.10 శాతం పెరిగింది. దీంతో ఔన్స్ వెండి రేటు 70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండోవ రోజూ దిగివచ్చాయి. 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు క్రితం రోజు 10 గ్రాములకు రూ.160 తగ్గగా ఈరోజు మరో రూ.270 మేర దిగివచ్చింది. దీంతో తులం బంగారం రేటు రూ.1,51,100 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు నిన్నటి రోజున తులానికిరూ.150 తగ్గగా ఈరోజు మరో రూ.250 తగ్గింది. దీంతో 10 గ్రాముల పసిడి ధర రూ.1,38,500 వద్దకు పడిపోయింది. దేశీయ మార్కెట్లో వెండి ధర ఇవాళ స్థిరంగా ఉంది. అయితే నిన్నటి రోజున హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.5000 మేర తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో కిలో వెండి రేటు రూ.2,75,000 వద్దకు దిగివచ్చింది. ఈరోజు అదే ధర వద్ద ట్రేడవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ జువెలరీల్లో ఒకటైన లలితా జువెలరీల్లో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ 1 గ్రాము బంగారం రేటు రూ.25 మేర తగ్గింది. దీంతో గ్రాము గోల్డ్ రేటు రూ. 13,850 వద్ద ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం రేటు రూ.1,38,500 వద్ద ట్రేడవుతోంది. రచయిత గురించిబండ తిరుపతిబండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2023లో సమయంలో చేరిన తిరుపతి.. బిజినెస్‌ రంగానికి సంబంధించి తాజా వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ న్యూస్, బంగారం వెండి