గంటల్లో.. 3
Actor ProfilePolitician

గంటల్లో.. 3

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గంటల్లో.. 3,651 కోర్సులు
Eenadu30 Aug 2026
గంటల్లో.. 3,651 కోర్సులు

ప్రభుత్వోద్యోగుల నైపుణ్యాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఐ గాట్‌ కర్మయోగి’లో ఓ ప్రధానోపాధ్యాయురాలు ఏకంగా వేల కోర్సులు పూర్తి చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండలం మాత్రియాతండా పాఠశాలలో జన్ను నాగకుమారి ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె విజయవాడలో నివాసం ఉంటారు. అక్కడి నుంచి బస్సులో పాఠశాలకు వెళ్లి రావడానికి రోజుకు 4 గంటలు పడుతుంది. ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలనే ఆలోచనతో వివిధ అంశాలపై ఐ గాట్‌ కర్మయోగి ఆన్‌లైన్‌ శిక్షణ ద్వారా కోర్సులను చేస్తున్నారు. ప్రతి కోర్సు శిక్షణ గంటకు పైగా ఉంటుంది. అనంతరం పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్‌ ఇస్తారు. ఇలా ఇప్పటి వరకు 4,825 గంటల్లో 3,651 కోర్సులను పూర్తి చేశారు. తాను నేర్చుకున్న ఆధునిక విద్యా విధానాలు, చైల్డ్‌ సైకాలజీ సూత్రాల సాయంతో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా పాఠాలు బోధిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రొఫెషనల్‌ ఆటగాడిలా గాల్లోకి డైవ్‌ చేస్తున్న ఈ బాలుడు పాఠశాల విద్యార్థే. అనంతపురం ఉరవకొండలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించారు. ఖోఖో ఆటలో భాగంగా ప్రత్యర్థి జట్టు ఆటగాడిని ఔట్‌ చేసేందుకు సదరు విద్యార్థి ఇలా డైవ్‌ చేశాడు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

గ టల ల 3 Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in