గల్లీ స్నేహితుల కథతో
Actor ProfileActor

గల్లీ స్నేహితుల కథతో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గల్లీ స్నేహితుల కథతో
Chitrajyothy29 Aug 2026
గల్లీ స్నేహితుల కథతో

రమణారెడ్డి సోమ తెరకెక్కించిన చిత్రం 'అమీర్ లోగ్'. ఈ సినిమాను త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలలో రానాకు చెందిన స్పిరిట్‌ మీడియా ద్వారా విడుదల చేయబోతున్నారు. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అమీర్‌ లోగ్’. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి పలువురు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ పోస్టర్, రాహుల్ సిప్లిగంజ్ పాడిన అవ్వల్ దావత్ సాంగ్, టీజర్ ఇలా అన్నీ బజ్‌ను క్రియేట్ చేశాయి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ చిత్రంగా రాబోతోంది ‘అమీర్ లోగ్’. రానా ‘స్పిరిట్ మీడియా’ ఈ ‘అమీర్ లోగ్’ మూవీ హక్కుల్ని సొంతం చేసుకుంది. ఈ మూవీని స్పిరిట్ మీడియా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోంది. ఈ చిత్రాన్ని చూసి.. అందులోని కంటెంట్ నచ్చి.. రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ గల్లీలోని ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే కథ, వారి ప్రయాణాన్ని, యూత్‌కి ఇచ్చే సందేశం ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. అందుకే స్పిరిట్ మీడియా ‘అమీర్ లోగ్‌’ను విడుదల చేయబోతోంది. PKCW: సినీ ఆశావహులకు పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్ ‘అంబ’స్ రివెంజ్’.. ఈ సినిమా స్పెషల్ ఏంటో తెలుసా ‘కాగితం పడవలు’ చిత్రబృందం చేసిన పనికి చిరు ఫిదా.. ఏం చేశారంటే

గల ల స న హ త ల కథత Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in