గర్భిణులకు హై బీపీ ముప్పు
Actor ProfilePolitician

గర్భిణులకు హై బీపీ ముప్పు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గర్భిణులకు హై బీపీ ముప్పు
Andhra Jyothy24 Jul 2026
గర్భిణులకు హై బీపీ ముప్పు

ముందే నిర్ధారణతో చెక్‌ లేకుంటే తల్లీబిడ్డలకు ఇబ్బందులు గాంధీ ప్రీ-ఎక్లెంప్సియా క్లినిక్‌లో చికిత్సలు ప్రసవానికి ముందు, తర్వాత వైద్యుల పర్యవేక్షణ హైదరాబాద్‌ సిటీ: గర్భిణులకు మొదటి నెల నుంచి పురిటి నొప్పుల వరకు అడగడుగునా అగ్నిపరీక్షే.. ప్రసవానికి ముందు, తర్వాత కూడా అనేక సవాళ్లు వారిని వెంటాడుతూనే ఉంటాయి. మహిళలు గర్భంతో ఉన్న సమయంలో వచ్చే హైబీపీ వారిని తీవ్రంగా వేధిస్తుంటుంది. గర్భిణులు, బాలింతలకు వచ్చే హైబీపీని వైద్యపరిభాషలో ‘ప్రీ-ఎక్లాంప్సియా’(pre -eclampsia)గా వైద్యులు వ్యవహరిస్తుంటారు. అధికరక్తపోటు వస్తే కడుపులో ఉన్న బిడ్డకు ముప్పుగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా సమస్యకు ముందు నుంచే చెక్‌ పెట్టడానికి గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్లినిక్‌లో చికిత్స అందిస్తున్నారు. ప్రీ - ఎక్లాంప్సియా అంటే.. గర్భధారణ సమయంలో సాధారణంగా 20 వారాల తర్వాత కనిపించే అధిక రక్తపోటు సమస్యను ప్రీ-ఎక్లాంప్సియాగా వ్యవహరిస్తారు. ఇది హైబీపీతో పాటు మూత్రంలో ప్రొటీన్‌ వెళ్లడం, మూత్రపిండాలు, ఇతర అవయవాలు దెబ్బతినడం వంటి ఇబ్బందులను కలిగిస్తుంది. కొన్నిసార్లు శిశువు పుట్టిన రెండు వారాల తరువాత ఇది కనిపిస్తుంది. నెలలు నిండకుండానే.. అధిక రక్తపోటు వల్ల నెలలు నిండకుండా ప్రసవించే ముప్పు ఉందని వైద్యులు వివరించారు. ఆరు, ఏడు, ఎనిమిది నెలలకే శిశువులు పుట్టే ప్రమాదముందన్నారు. ఇలా పుట్టిన శిశువులకు అవయవాలు వృద్ధి చెందవని, దీని వల్ల వారు చనిపోయే ముప్పు ఉంటుందన్నారు. హైరిస్కు ఉన్న గర్భిణులకు ఈ జబ్బు ఉంటే కొన్ని సందర్భాల్లో గర్భ విచ్ఛిన్నం చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. వీళ్లకు ఇబ్బందులు త్వరగా, ఆలస్యంగా వివాహం చేసుకున్న వారు. 18 ఏళ్లలోపు, 40 ఏళ్లు తరువాత గర్భం దాల్చిన మహిళలు. హైబీపీ 140/90 మించి ఉన్న గర్భిణులు. అధిక బరువు, కొలెస్ట్రాల్‌, మధుమేహం, మూత్రపిండాల జబ్బులు ఉన్న వారికి ఇబ్బందులు ఉంటాయి. ఇలా ఉంటే... అధిక రక్తపోటు.. కడుపు నొప్పి, తలనొప్పి, వాంతులు, ముఖం, చేతులు వాపు, మూత్రం

గర భ ణ లక హ బ ప మ ప ప Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in