
జిల్లాలో చేపట్టిన యాసంగి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంలో అధికారుల కృషి అభినందనీయమని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృ త కలెక్టరేట్ భవన సముదాయంలో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో 1.50 కోట్ల లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు జరిగినందున తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సన్నరకం బియ్యంతో తయారు చేసిన ఏడు రకాల పిండి వంటల కిట్లను సంబంధిత అధికారులకు అందజేశారు ఆసిఫాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపట్టిన యాసంగి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంలో అధికారుల కృషి అభినందనీయమని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృ త కలెక్టరేట్ భవన సముదాయంలో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో 1.50 కోట్ల లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు జరిగినందున తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సన్నరకం బియ్యంతో తయారు చేసిన ఏడు రకాల పిండి వంటల కిట్లను సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ యాసంగి వరి ధాన్యం, మొక్కజొన్నలు, జొన్నల కొనుగోలు నిర్ణీత గడువులోగా రైతులకు ఇబ్బందులు లేకుండా పూర్తి చేయడంలో అధికారుల కృషి అభినందనీయమని కొనియాడారు. ఇదే స్పూర్తితో భవిష్యత్‌తో కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖాధికారులు పాల్గొన్నారు. పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు బొంబాయి గూడ, చెడ్వాయి గ్రామాల్లో ఇంటింటికి పంపిణీ చేస్తున్న ఎన్యుమరేషన్ ఫారాల ప్రక్రియను గురువారం కలెక్టర్ కె హరిత పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారం అందించిన వెంటనే బీఎల్‌వో యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులకు