ఖతార్ లో భారీ అగ్నిప్రమాదం
Actor ProfilePolitician

ఖతార్ లో భారీ అగ్నిప్రమాదం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఖతార్ లో భారీ అగ్నిప్రమాదం, 54మందికి గాయాలు, 18మంది ఆచూకీ గల్లంతు
Andhra Jyothy27 Jun 2026
ఖతార్ లో భారీ అగ్నిప్రమాదం, 54మందికి గాయాలు, 18మంది ఆచూకీ గల్లంతు

ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావంతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఖతార్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోని కీలక సహజవాయువు ఎగుమతి కేంద్రం రాస్ లాఫాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఆదివారం రాత్రి భారీ పేలుడు సంభవించి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దోహా: ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావంతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఖతార్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోని కీలక సహజవాయువు ఎగుమతి కేంద్రం రాస్ లాఫాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఆదివారం రాత్రి భారీ పేలుడు సంభవించి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 54మంది గాయపడగా.. మరో 18మంది ఆచూకీ లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ దాడుల కారణంగా నిలిచిపోయిన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు కార్మికులు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. యుద్ధ సమయంలో ఇరాన్ బాంబు దాడులకు గురైన తర్వాత ఖతార్‌లోని గ్యాస్ ఉత్పత్తి, ఎగుమతి వ్యవస్థలు తీవ్ర అంతరాయం, ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కాగా, ప్రపంచంలోనే అగ్రగామి సహజ వాయు ఉత్పత్తిదారుల్లో ఖతార్ ఒకటి. అయితే, యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ప్రభావం పెరగడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. ప్రస్తుతం యుద్ధానికి శాశ్వత ముగింపు దిశగా చర్చలు కొనసాగుతున్న వేళ హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ తన వైఖరిని కొంతమేర మార్చుకుంది. దీంతో ఖతార్ మళ్లీ ఎగుమతి కార్యకలాపాలను ప్రారంభించే పనుల్లో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి బర్జాన్ గ్యాస్ సప్లై ఫెసిలిటీలో పేలుడు సంభవించినట్లు ప్రభుత్వరంగ సంస్థ ఖతార్ ఎనర్జీ వెల్లడించింది. పేలుడు అనంతరం భారీ మంటలు చెలరేగడంతో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. తొలుత కొంతమందికే గాయాలు అయ్యాయని అధికారులు ప్రకటించినప్పటికీ, కొన్ని గంటల తర్వాత ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం 54మంది గాయపడ్డారని, 18మంది గల్లంతయ్యారని వెల్లడించింది. అయితే, పేలుడు కారణంగా ఏర్పడిన నష్టం ఎంత మేర ఉందనే దానిపై ఇంకా

ఖత ర ల భ ర అగ న ప రమ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in