ఖతార్ గ్యాస్ ప్లాంట్ లో భారీ పేలుడు.. 12 మంది భారతీయులు దుర్మరణం
Actor ProfilePolitician

ఖతార్ గ్యాస్ ప్లాంట్ లో భారీ పేలుడు.. 12 మంది భారతీయులు దుర్మరణం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఖతార్ గ్యాస్ ప్లాంట్ లో భారీ పేలుడు.. 12 మంది భారతీయులు దుర్మరణం
Zee Telugu4 Jul 2026
ఖతార్ గ్యాస్ ప్లాంట్ లో భారీ పేలుడు.. 12 మంది భారతీయులు దుర్మరణం

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Ras Laffan Industrial City Indians Killed: ఖతార్ లోని ప్రముఖ రాస్ లఫాన్ లిక్విఫైడ్ నేచరుల్ గ్యాస్ ఇండస్ట్రీలో సంభవించిన భారీ పేలుడులో 13 మంది దుర్మరణం చెందారు. 66 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో 12 మంది భారతీయులు ఉన్నారు. ఇరాన్ జరిపిన క్షిపణి దాడి కారణంగా నిలిచిపోయిన కార్యకలాపాలను కార్మికులు పునరుద్ధరిస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగింది. బర్జాన్ గ్యాస్ సరఫరా విభాగంలో ఈ పేలుడు జరిగిందని.. ఇదొక సాంకేతిక ప్రమాదమని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఖతార్‌లో ప్రాణాలు కోల్పోయిన భారత పౌరులకు, గాయపడిన వారికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఖతార్‌లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో జరిగిన పేలుడులో భారత పౌరులతో సహా ప్రాణాలు కోల్పోవడం, గాయపడటం వంటి వార్తలకు నేను తీవ్రంగా విచారించాను. మరిన్ని వివరాలు వెలువడుతున్న కొద్దీ, దోహాలోని మా భారత రాయబార కార్యాలయం ఖతార్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఈ విషాదంతో ప్రభావితమైన భారత పౌరుల కుటుంబాలకు సహాయం అందించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాధితులకు, వారి కుటుంబాలకు మా ప్రార్థనలు, సానుభూతి తెలియజేస్తున్నాము అని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ప్రమాదంలో మరణించిన 12 మంది భారతీయుల పార్థివ దేహాలను వీలైనంత త్వరగా వారి స్వస్థలాలైన భారతదేశానికి పంపించడానికి, చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసేందుకు ఖతార్ అధికారులతో కలిసి వేగంగా పనిచేస్తున్నట్లు దోహాలోని భారత రాయబార కార్యాలయం, ఖతార్ అధికారులను ఉటంకిస్తూ సోమవారం ధృవీకరించింది. ప్రమాదంలో గాయపడిన వారందరి పరిస్థితి ఇప్పుడు పూర్తిగా నిలకడగా ఉందని