క్షణ క్షణం ఉత్కంఠ.. జనాలు తెగ చూస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్.. ఓటీటీలో సత్తా చాటుతున్న సినిమా
Actor ProfileCelebrity

క్షణ క్షణం ఉత్కంఠ.. జనాలు తెగ చూస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్.. ఓటీటీలో సత్తా చాటుతున్న సినిమా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
క్షణ క్షణం ఉత్కంఠ.. జనాలు తెగ చూస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్.. ఓటీటీలో సత్తా చాటుతున్న సినిమా
TV9 Telugu2 Sept 2026
క్షణ క్షణం ఉత్కంఠ.. జనాలు తెగ చూస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్.. ఓటీటీలో సత్తా చాటుతున్న సినిమా

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక యాక్షన్ థ్రిల్లర్ డ్రామా తెగ వైరలవుతుంది. ఆ సినిమా పేరు అనలి. ఈ మూవీ ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఒక తల్లి తన బిడ్డను రక్షించుకోవడానికి పడే తపన, చేసే పోరాటమే ఈ సినిమా ముఖ్య కథాంశం. థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక విభిన్నమైన అనుభూతిని అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. 'జాన్సి' అనే ఒక సామాన్యమైన మహిళ, ఆమె ఎనిమిదేళ్ల చిన్నారి ఒక ఊహించని ప్రమాదకరమైన పరిస్థితిలో చిక్కుకుంటారు. ఒక భయంకరమైన రాత్రి వేళ ముగ్గురు క్రూరమైన వ్యక్తులు వారిని వేటాడుతుంటారు. ఆ ముగ్గురు హంతకుల బారి నుంచి తన బిడ్డను కాపాడుకోవడానికి ఆ తల్లి ఎలాంటి సాహసాలు చేసింది? తన తెలివితేటలు, మనోధైర్యంతో ఆ రాత్రిని ఎలా దాటగలిగింది? అనేదే సినిమా. సింథియా లూర్డే (Cynthia Lourde) ప్రధాన పాత్ర అయిన జాన్సిగా అద్భుతమైన నటనను కనబరిచారు. ఒకవైపు భయం, మరోవైపు బిడ్డను రక్షించుకోవాలనే పట్టుదలను ఆమె తన నటనతో పండించారు. నెగెటివ్ పాత్రల్లో కబీర్ దుహాన్ సింగ్, శక్తి వాసు (Shakthi Vasu) తమ నటనతో మెప్పించారు. దినేష్ దేనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కథకు మరింత బలాన్ని చేకూర్చాయి. సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ దృష్ట్యా, ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ మూవీ మంచి వీక్షక ఆదరణను సొంతం చేసుకుంది. హిందీ, తమిళ వెర్షన్లతో పాటు దక్షిణాది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఎలాంటి ల్యాగ్ లేకుండా దాదాపు రెండు గంటల పాటు సాగే ఈ ఉత్కంఠభరితమైన యాక్షన్ థ్రిల్లర్‌ను వీక్షకులు ఓటీటీలో చూసేందుకు బాగా ఆసక్తి

క షణ క షణ ఉత క ఠ జన ల త గ చ స త న న స కల జ కల థ ర ల లర ఓట ట ల సత త చ ట త న న స న మ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in