
కువైట్‌లోని తెలుగుదేశం, జనసేన నాయకులు కూటమి ప్రభుత్వం సుపరిపాలన రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తిచేసుకున్న శుభసందర్భాన విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇంటర్నెట్ డెస్క్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): కువైట్‌లోని తెలుగుదేశం, జనసేన నాయకులు కూటమి ప్రభుత్వం సుపరిపాలన రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తిచేసుకున్న శుభసందర్భాన విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఫర్వానియా ద్వైహి ప్యాలెస్ హోటెల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. కూటమి ప్రభత్వం గత రెండేళ్లుగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి గల్ఫ్ ఎంపర్‌మెంట్ కో-ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకరరావు వివరించారు. కూటమి ప్రభుత్వం నమ్మకానికి మారుపేరని, మరో పదిహేను సంవత్సరాలు ఇదే ఐఖ్యతతో కొనసాగాలని గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్ కంచన శ్రీకాంత్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కుదరవల్లి సుధాకరరావు, మద్దిన ఈశ్వర్ నాయుడు, మాలేపాటి సురేశ్ బాబు, రషీదా బేగం, ఈడుపుగంటి దుర్గాప్రసాద్, వీసీ సుబ్బారెడ్డి, గజులపల్లి సుబ్బారెడ్డి, కొల్లి ఆంజనేయులు, పోలారపు బాబు నాయుడు, కట్టా రామచంద్ర నాయుడు, ఆర్. వెంకట సుబ్బయ్య, లాస్య రాజు, రాపాక రాజేశ్, ఆషిశ్, శివరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కంచన శ్రీ కాంత్, రామచంద్ర నాయక్, అంజన కుమార్ పగడాల, ఆకుల రాజేశ్, బిరడ సూర్యనారయణ, ఇమ్మిడిశెట్టి సూర్యనారాయణ, ఓబులేస్, ఆలీ షేక్, గిడుగు రాంబాబు, గిడిగు ఏసుబాబు, దండు వేణు, గంగారపు చంద్రశేఖర్, కొమ్మినేని బాలాజీ, ముండ్లపాటి మురళి, విను రాయల్, కొట్టిడి శివ, కోలా శ్రీకాంత్, ఉగ్గు పెంచలయ్య, అప్పిన చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో చివరగా నందమూరి బాలకృష్ణ 66వ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. డాలస్‌లో తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి మునిరత్నం నాయుడికి ఘనస్వాగతం టెన్జింగ్-హిల్లరీ ఎవరెస్ట్ మారథాన్ పూర్తిచేసిన తానా బోర్డ్ చైర్మన్