కేవలం మూడు రోజుల్లోనే మీ చేతికి పాస్ పోర్ట్... ఎలాగో తెలుసా
Actor ProfilePolitician

కేవలం మూడు రోజుల్లోనే మీ చేతికి పాస్ పోర్ట్... ఎలాగో తెలుసా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కేవలం మూడు రోజుల్లోనే మీ చేతికి పాస్ పోర్ట్... ఎలాగో తెలుసా
Asianet News Telugu31 Jul 2026
కేవలం మూడు రోజుల్లోనే మీ చేతికి పాస్ పోర్ట్... ఎలాగో తెలుసా

పాస్ పోర్ట్... విదేశాలకు వెళ్లాలంటే ఇది తప్పనిసరి. కానీ ఈ పాస్ పోర్ట్ పొందేందుకు లాంగ్ ప్రాసెస్ ఉంటుంది... అందుకే చాలామంది విదేశీ ప్రయాణాలు లేకున్నా ముందుజాగ్రత్తగా దీన్ని తీసిపెట్టుకుంటారు. ఉన్నత చదువులు, ఉద్యోగ పనులు లేదా మరేదైనా కారణంతో అత్యవసరంగా విదేశాలకు వెళ్లాల్సి రావచ్చు... ఇలాంటప్పుడు చేతిలో పాస్ పోర్ట్ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ పాస్ పోర్ట్ లేకుంటే పరిస్ధితి ఏంటి? అయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. అత్యవసర సమయాల్లో జెట్ స్పీడ్ లో పాస్ పోర్ట్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసింది... అదే తత్కాల్ పాస్ పోర్ట్. విదేశాల్లో ఉద్యోగం, చదువు, వైద్యం, వ్యాపారం లేదా మరేదైనా అత్యవసర పని మీద వెళ్లాల్సి వస్తే తత్కాల్ పాస్‌పోర్ట్ పొందవచ్చు. సాధారణంగా అయితే పాస్ట్ పోర్ట్ జారీకి 30 నుండి 45 రోజులు పడుతుంది... కానీ ఈ తత్కాల్ పాస్ పోర్ట్ ను కేవలం మూడు రోజుల్లోనే పొందవచ్చు. ఒకేరోజులో తత్కాల్ పాస్ పోర్ట్ జారీచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ తత్కాల్ పాస్ పోర్ట్ పొందాలంటే అవసరమైన డాక్యుమెంట్లు, ప్రాసెస్, నియమాల గురించి కచ్చితంగా తెలిసి ఉండాలి... లేదంటే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ ఫాస్ట్ ట్రాక్ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తుదారులు అన్ని డాక్యుమెంట్లను సరైన సమాచారంతో సబ్మిట్ చేయాలి. పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో మీ అప్లికేషన్ ఆమోదం పొందాక కేవలం 3 పనిదినాల్లోనే పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. ఇలా అత్యవసర సమయాల్లో ఈ తత్కాల్ పాస్ పోర్ట్ స్కీమ్ ఆదుకుంటుంది. తత్కాల్ పాస్ పోర్ట్ కోసం అప్లై చేసేవారికి, సాధారణ పద్ధతిలో అప్లై చేసేవారికంటే అపాయింట్‌మెంట్ త్వరగా దొరుకుతుంది. ఈ స్కీమ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి, పనులు వేగంగా జరుగుతాయి. చాలా సందర్భాల్లో ముందుగా ఈ తత్కాల్ పాస్‌పోర్ట్ జారీ చేసి, ఆ తర్వాతే పోలీస్ వెరిఫికేషన్ చేస్తారు. ఇది

క వల మ డ ర జ ల ల న మ చ త క ప స ప ర ట ఎల గ త ల స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in