కుల రాజకీయాల కుంపటిగా మార్చడం దారుణం.. అడుసుమిల్లి
Actor ProfilePolitician

కుల రాజకీయాల కుంపటిగా మార్చడం దారుణం.. అడుసుమిల్లి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కుల రాజకీయాల కుంపటిగా మార్చడం దారుణం.. అడుసుమిల్లి
TeluguOne19 Jun 2026
కుల రాజకీయాల కుంపటిగా మార్చడం దారుణం.. అడుసుమిల్లి

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ కేసు చుట్టూ రోజుకో మలుపు తిరుగుతుండటంతో అసలు ఏం జరిగిందనే దానిపై సర్వత్రా మిస్టరీ నెలకొంది. అయితే, ఒక తల్లి కడుపుకోతగా మిగిలిన ఈ సున్నితమైన కేసును కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కులాల కుంపటిగా మార్చడానికి ప్రయత్నించడం అత్యంత దారుణమని ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఉదంతంపై మాట్లాడారు. ప్రస్తుతం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. సాయికృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకుని కొట్టి చంపేశారా? లేక అతడు పరారీలో ఉన్నాడా? అనే కోణంలో విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే బాధ్యుడిగా భావిస్తున్న కృష్ణలంక సీఐ నాగరాజును సస్పెండ్ చేసింది. న్యాయస్థానం పర్యవేక్షణలో ఉన్న ఈ కేసుపై రాజకీయ నాయకులు తొందరపడి తీర్పులు ఇవ్వడం సరికాదన్నఅడుసుమిల్లి.. సాయికృష్ణ తల్లి ఆవేదనను ప్రతి ఒక్కరూ మానవీయ కోణంలో అర్థం చేసుకోవాలన్నారు. తన బిడ్డ బతికున్నాడో లేదో తెలియక, కనీసం చనిపోయాడని తెలిస్తే ఒక ఏడుపు ఏడ్చి ఊరుకునే పరిస్థితి కూడా ఆ తల్లికి లేకుండా పోయిందని, బూడిదైనా ఇవ్వాలంటూ ఆమె రోదించడం ఎంతో దారుణమన్నారు. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఉంది కాబట్టే, ఒక తల్లి తన బిడ్డ కోసం పోలీసులను, వ్యవస్థలను నిలదీసే స్వేచ్ఛ లభించిందని కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. అయితే, ఈ కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22 క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు