కాలనీల్లో నీటి తిప్పలు.. జలమండలిని స్వాధీనం చేసుకోమని డిమాండ్
Actor ProfilePolitician

కాలనీల్లో నీటి తిప్పలు.. జలమండలిని స్వాధీనం చేసుకోమని డిమాండ్

Total News1
Movie Updates0
Sources1
కాలనీల్లో నీటి తిప్పలు.. జలమండలిని స్వాధీనం చేసుకోమని డిమాండ్
Telugu Times15 Jun 2026
కాలనీల్లో నీటి తిప్పలు.. జలమండలిని స్వాధీనం చేసుకోమని డిమాండ్

Water Supply: హైదరాబాద్ నగరంలోని సుమారు 800కు పైగా బల్క్ సరఫరా కాలనీలలో నీటి సమస్యలు క్లిష్టంగా మారాయి. నివాసితులు నీటి కోసం అధిక ధరలు చెల్లించాల్సి రావడం , అసొసియేషన్లు ఆర్థిక భారాన్ని మోయలేక సతమతమవుతున్నాయి. కేవలం రూ. 500లకే లభించేది.. కూకట్‌పల్లి అల్విన్ కాలనీలో వ్యక్తిగత ‘క్యాన్’ నంబర్ లేని కారణంగా, నివాసితులు వాణిజ్య కోటా కింద 5 వేల లీటర్ల నీటి ట్యాంకర్ కోసం రూ. 1,500 (ట్యాంకర్ ఛార్జీ రూ. 1,300 + డ్రైవర్ బత్తా రూ. 200) చెల్లించాల్సి వస్తోంది. ఒకవేళ వ్యక్తిగత క్యాన్ నంబర్ ఉంటే ఇదే నీరు కేవలం రూ. 500లకే లభించేదని వాపోతున్నారు. వడ్డీ భారం లక్షల్లో.. నెలవారీ రూ. 300 బిల్లు వసూలు చేస్తున్నప్పటికీ, కేవలం 40 నిమిషాలు మాత్రమే నీటి సరఫరా ఉండటంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీ అసొసియేషన్లు ఇప్పటికే కోట్ల రూపాయల బకాయిలను ఎదుర్కొంటున్నాయి, దీనిపై వడ్డీ భారం కూడా లక్షల్లో పెరుగుతోంది. పాత పైపులైన్ల నిర్వహణ భారంగా మారడం , ప్రభుత్వ రాయితీలు అందకపోవడం అసొసియేషన్లను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. జలమండలికి విజ్ఞప్తి.. ఈ సమస్యల పరిష్కారానికి జలమండలి నేరుగా రంగంలోకి దిగి, ఈ వ్యవస్థను స్వాధీనం చేసుకోవాలని అల్విన్ కాలనీ అసొసియేషన్ ప్రతినిధులు కోరుతున్నారు. ప్రతి వినియోగదారునికి వ్యక్తిగత క్యాన్ నంబర్ జారీ చేయడం ద్వారా, బకాయిల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు

క లన ల ల న ట త ప పల జలమ డల న స వ ధ న చ స క మన డ మ డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in