
ఇంటర్నెట్ డెస్క్: భారీ యాక్షన్ సన్నివేశాలతో అలరించడానికి సద్ధమయ్యారు అలియా భట్, శార్వరీ వాఘ్. వీరు ప్రధానపాత్రల్లో శివ్ రావేల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆల్ఫా’. జులై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా అలియా ఓ విషయాన్ని పంచుకున్నారు. యాక్షన్ సన్నివేశాలు ప్రాక్టీస్ చేసే సమయంలో తాను (Alia Bhatt) ఓ కొరియోగ్రాఫర్‌ను అనుకోకుండా కొట్టినట్లు తెలిపారు. ‘అతడిని కొట్టిన వెంటనే నేను సారీ చెప్పా. నా వల్ల ఒకరికి దెబ్బ తగిలినందుకు చాలా బాధేసింది. అది గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పటికీ బాధపడతాను’ అని చెప్పారు. అయితే, ఈ సంఘటనతో సినిమాలోని యాక్షన్ కొరియోగ్రఫీ ఎంత సహజంగా సాగిందో తెలుస్తోందని ఆమె అన్నారు. ఆల్ఫా (Alpha) తనకు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందన్నారు. మునుపెన్నడూ చూడని పాత్రలో తాను నటించినట్లు చెప్పారు. ఇక ఈ సినిమాలో బాబీ దేవోల్ కూడా కీలకపాత్రలో కనిపించనున్నారు. అలియాతో యాక్షన్ సన్నివేశాలు చేసే సమయంలో తాను భయపడినట్లు చెప్పారు. ఆమె చాలా సన్నగా ఉంటారని.. ఎక్కడ దెబ్బ తగులుతుందోనని ప్రతి సన్నివేశాన్ని జాగ్రత్తగా చేసినట్లు తెలిపారు. అలియా ఇందులో యాక్షన్ సీన్స్ అదరగొట్టిందన్నారు. వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు