
సంధ్య థియేటర్ (Sandhya Theatre) కేసులో నాంపల్లి కోర్టుకు సినీనటుడు అల్లు అర్జున్ (Allu Arjun) హాజరు కాలేదు. షూటింగ్ (shooting) వల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరుకావాలని 19 మంది నిందితులకు ఇటీవల నాంపల్లి కోర్టు (Nampally Court) ఆదేశాలు జారీ చేసింది. అయితే అల్లు అర్జున్ మినహా మిగతా నిందితులంతా న్యాయమÖర్తి ఎదుట హాజరై బాండ్లపై సంతకాలు చేశారు. అనంతరం కేసు విచారణను న్యాయమÖర్తి జులై 6కి వాయిదా వేశారు. ఈ కేసులో అల్లు అర్జున్‌ను A11 నిందితుడిగా పోలీసులు చేర్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన 2024 డిసెంబర్ 4వ తేదీన పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్ వద్ద చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్‌కు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు