క్రికెట్ లో ఇది చరిత్రాత్మక ఘట్టం
Actor ProfileActor

క్రికెట్ లో ఇది చరిత్రాత్మక ఘట్టం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
క్రికెట్ లో ఇది చరిత్రాత్మక ఘట్టం
Eenadu11 Jul 2026
క్రికెట్ లో ఇది చరిత్రాత్మక ఘట్టం

ఇంటర్నెట్‌ డెస్క్: మహిళా క్రికెటర్ల కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తీసుకువచ్చిన కొత్త ‘పోస్ట్ ప్రెగ్నెన్సీ రిటర్న్‌ టు ప్లే’ (ప్రసవానంతరం తిరిగి ఆటలోకి రావడం) మార్గదర్శకాలను బాలీవుడ్ అగ్రకథానాయిక దీపికా పదుకొణె (Deepika Padukone) స్వాగతించారు. క్రీడల్లో మహిళల కోసం తీసుకున్న అత్యంత అద్భుతమైన నిర్ణయమిదని.. ఒక చరిత్రాత్మక ఘట్టమని ప్రశంసించారు. ఐసీసీ ప్రకటించిన ఈ సరికొత్త పాలసీను దీపికా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకుంటూ.. మహిళా క్రికెటర్లకు లభించిన గొప్ప గుర్తింపుగా దీనిని అభివర్ణించారు. వర్కింగ్‌ అవర్స్‌ కారణంగా గతేడాదిలో దీపిక భారీ ప్రాజెక్ట్‌ల నుంచి వైదొలగారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అనంతరం పలు ఇంటర్వ్యూల్లో బాలీవుడ్‌ అగ్రనటీనటులు మాట్లాడుతూ దీపికకు మద్దతు ఇచ్చారు. తల్లి అయిన అనంతరం హీరోయిన్‌లకు కొన్ని వెసులుబాటులు కల్పించాలని తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్తగా తల్లి అయిన మహిళా క్రికెటర్ల కోసం ప్రవేశపెట్టిన పాలసీపై రెండోసారి తల్లి కానున్న దీపిక పోస్ట్‌ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మహిళా క్రికెటర్లు ప్రసవానంతరం మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టే ప్రక్రియను సులభతరం చేసేందుకు ఐసీసీ కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ప్రసవం తర్వాత క్రికెటర్లకు అవసరమైన వైద్య, మానసిక సంరక్షణతో పాటు వ్యక్తిగత రికవరీ ప్లాన్‌లను అందిస్తారు. తిరిగి ఫిట్‌నెస్ సాధించేలా ట్రైనింగ్ షెడ్యూల్స్ ఉంటాయి. పసిపిల్లలతో కలిసి ప్రయాణించే తల్లుల కోసం ప్రత్యేక వసతులను ఐసీసీ కల్పిస్తుంది. ఇక దీపిక సినిమాల విషయానికి వస్తే, షారుక్‌- సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో రానున్న ‘కింగ్’లో నటిస్తున్నారు. అల్లు అర్జున్‌కు జోడీగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రాకా’లో సందడి చేయనున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల