కేబినెట్ భేటీలో సంచలన నిర్ణయాలు.. ఆ పథకానికి ఆమోదం
Actor ProfilePolitician

కేబినెట్ భేటీలో సంచలన నిర్ణయాలు.. ఆ పథకానికి ఆమోదం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కేబినెట్ భేటీలో సంచలన నిర్ణయాలు.. ఆ పథకానికి ఆమోదం
Oneindia Telugu6 Sept 2026
కేబినెట్ భేటీలో సంచలన నిర్ణయాలు.. ఆ పథకానికి ఆమోదం

తెలంగాణ కేబినెట్ భేటీ తాజాగా పూర్తయింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిల్లో రాష్ట్రంలో వీబీ జీ రామ్ జీ పథకం అమలు, మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్, ప్రభుత్వ ఉపాధ్యాయులకు అల్పాహారం తదితర అంశాలు ఉన్నాయి. కేబినెట్ సమావేశం అనంతరం ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో వీబీ జీ రామ్ పథకం అమలు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ఈ మేరకు అభ్యంతరాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. అలాగే మూసీ ప్రాజెక్ట్ సుందరీకరణ అంశంపైనా కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. మూసీ ప్రాజెక్ట్ మొదటి దశకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రూ. 7,345 కోట్లతో మూసీ సుందరీకరణ పనులు జరగనున్నాయి. ఈ క్రమంలో టెండర్లు పిలిచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఇకపై వారికి కూడా అల్పాహారం, మధ్యాహ్నా భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే విద్యార్థులకు ఈ పథకం అమల్లోకి ఉండగా తాజాగా ఉపాధ్యాయులకూ వర్తింపజేస్తూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇక దీనికి సంబంధించి విధి విధానాలు, ఇతర అంశాలు అధికారికంగా ప్రభుత్వం త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే టిమ్స్, వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో దాదాపు 6 వేలకు పైగా పోస్టులు మంజూరు చేసింది. ఇక గోదాములు, విద్యాలయాలు, సంస్థల నిర్మాణం కోసం స్థలాలు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది రాష్ట్ర కేబినెట్

క బ న ట భ ట ల స చలన న ర ణయ ల ఆ పథక న క ఆమ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in