.webp)
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణాన్ని ముగించడానికి వాషింగ్టన్-టెహ్రాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని

.webp)
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణాన్ని ముగించడానికి వాషింగ్టన్-టెహ్రాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని

అమెరికా రక్షణ రంగ చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన, యుద్ధ విమానంగా పేరుగాంచిన బీ 52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ విమానం కుప్పకూలింది. కాలిఫోర్నియాలోని ప్రసిద్ధ ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో జరిగిన ఈ ప్రమాదం అమెరికా వైమానిక దళాన్ని, అంతర్జాతీయ రక్షణ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఎనిమిది మంది రక్షణ సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ఎయిర్‌బేస్ రన్‌వేపైనే ఈ భారీ యుద్ధ విమానం కుప్పకూలింది. సాధారణ టెస్ట్ మిషన్‌లో భాగంగా ఈ భారీ బాంబర్ విమానం రన్‌వే నుంచి గాల్లోకి టేకాఫ్ అయింది. అయితే.. టేకాఫ్ నిముషాల వ్యవధిలోనే సాంకేతిక లోపం తలెత్తడంతో రన్‌వే సమీపంలోనే అత్యంత వేగంగా భూమిని ఢీకొట్టింది. విమానం కూలిన వెంటనే భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన, నల్లటి పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న వైమానిక దళ రెస్క్యూ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభిం చినప్పటికీ లాభం లేకపోయింది. 412వ టెస్ట్ వింగ్ డిప్యూటీ కమాండర్ కల్నల్ జేమ్స్ హేస్ ఈ ఘోర ప్రమాదాన్ని ధ్రువీకరించారు. విమానం ప్రమాదానికి గురైందని, లోపల ఉన్న వారిలో ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదనీ పేర్కొన్నారు. మరణించిన ఆ ఎనిమిది మందిని గొప్ప అమెరికన్లు గా అభివర్ణిస్తూ వారికి నివాళులర్పించారు. మృతుల్లో అమెరికా సైనిక సిబ్బందితో పాటు, రక్షణ రంగానికి చెందిన సాంకేతిక నిపుణులు, ప్రభుత్వ, ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఉన్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే.. అమెరికా ఎయిర్ ఫోర్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాడార్ మోడరనైజేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ విమానం ప్రయోగాత్మక ప్రయాణం చేస్తోంది. యుద్ధ విమానాల్లో అత్యంత కీలకమైన యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అర్రే ఏఈఎస్ఏ అనే సరికొత్త అత్యాధునిక రాడార్ వ్యవస్థ పనితీరును పరిశీలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ అత్యున్నత సాంకేతిక రాడార్