
100–150 బీపీఎస్ మేర తగ్గనున్న లాభాల మార్జిన్లు న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దేశీ కార్పొరేట్ల ఆర్థిక పనితీరుపై ప్రభావం చూపనున్నాయి. వీటికి ఎల్‌నినో ఎఫెక్ట్ కూడా తోడు కావడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీల నిర్వహణ లాభాల మార్జిన్లు దెబ్బతినే అవకాశం ఉంది. సుమారు 100–150 బీపీఎస్ మేర తగ్గొచ్చని అంచనాలు నెలకొన్నాయి. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఎల్ నినో పరిస్థితుల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ దెబ్బతినవచ్చు. అలాగే కార్పొరేట్ రంగంలో పలు సంస్థల ఆదాయాలపైనా ప్రభావం పడొచ్చు. ‘క్రూడాయిల్ రేట్లు భగ్గుమనడం, రూపాయి క్షీణత వల్ల దిగుమతుల వ్యయాలు పెరిగిపోవడం కారణంగా 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) నిర్వహణ లాభాల మార్జిన్ (ఓపీఎం) 100–150 బేసిస్ పాయింట్ల (ఒకటి–ఒకటిన్నర శాతం) మేర తగ్గే అవకాశం ఉంది‘ అని ఇక్రా వెల్లడించింది. సమీప భవిష్యత్తులో కూడా పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఎల్‌నినోపరంగా డిమాండ్‌కి రిసు్కలు పొంచి ఉన్నాయని పేర్కొంది. దీనితో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా తోడై కార్పొరేట్ల ఆదాయాల మీద ప్రభావం పడొచ్చని వివరించింది. 2026–27లో కార్పొరేట్ ఇండియా ఆదాయ వృద్ధి సింగిల్ డిజిట్‌కి పరిమితం కావొచ్చని తెలిపింది. 2025–26 క్యూ4లో వార్షిక ప్రాతిపదికన ఆదాయ వృద్ధి 13.2 శాతంగా నమోదైంది. ధరల పెంపుతో కాస్త ఊరట.. పశ్చిమాసియా సంక్షోభం వల్ల ఇంధనాలు, లాజిస్టిక్స్, ప్యాకేజింగ్ వ్యయాలు గణనీయంగా పెరిగిపోయాయి. అలాగే రూపాయి పతనంతో దిగుమతి చేసుకునే ముడి వస్తువుల ధరలూ పెరిగాయి. ఇవన్నీ వెరసి సమీప భవిష్యత్తులో లాభాల మార్జిన్లపై ప్రభావం చూపవచ్చు. అయితే, పాక్షికంగానే అయినప్పటికీ ధరలను పెంచడం వల్ల మార్జిన్లపై ఒత్తిడిని కంపెనీలు కొంత మేర అధిగమించవచ్చు. కాకపోతే, హఠాత్తుగా ధరలను పెంచేస్తే డిమాండ్ దెబ్బతిని, పోటీ సంస్థలతో పోలిస్తే వెనుకబడిపోయే అవకాశాలూ ఉన్నాయి. వేతన జీవుల ఆదాయాలు స్థిరంగా