కేంద్రం నోటీసులు.. ఎక్స్ వేదికగా స్పందించిన వాట్సాప్
Actor ProfilePolitician

కేంద్రం నోటీసులు.. ఎక్స్ వేదికగా స్పందించిన వాట్సాప్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కేంద్రం నోటీసులు.. ఎక్స్ వేదికగా స్పందించిన వాట్సాప్
Andhra Jyothy31 Aug 2026
కేంద్రం నోటీసులు.. ఎక్స్ వేదికగా స్పందించిన వాట్సాప్

వాట్సాప్‌లో ప్రవేశపెట్టబోతున్న యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో మెటా సంస్థకు చెందిన వాట్సాప్‌ కీలక వివరణ ఇచ్చింది. ప్రస్తుతం యూజర్‌నేమ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాలేదని, వినియోగదారులు తమకు నచ్చిన యూజర్‌నేమ్‌ను ముందస్తుగా రిజర్వ్‌ చేసుకునే అవకాశం మాత్రమే కల్పించామని స్పష్టం చేసింది. న్యూఢిల్లీ: వాట్సాప్‌లో ప్రవేశపెట్టబోతున్న యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో మెటా సంస్థకు చెందిన వాట్సాప్‌ కీలక వివరణ ఇచ్చింది. ప్రస్తుతం యూజర్‌నేమ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాలేదని, వినియోగదారులు తమకు నచ్చిన యూజర్‌నేమ్‌ను ముందస్తుగా రిజర్వ్‌ చేసుకునే అవకాశం మాత్రమే కల్పించామని స్పష్టం చేసింది. ఈ ఫీచర్‌ను ఈ ఏడాది చివర్లో దశలవారీగా అమలు చేస్తామని వెల్లడించింది. యూజర్‌నేమ్‌ ఫీచర్‌తో వినియోగదారులు తమ మొబైల్‌ నంబర్‌ను వెల్లడించకుండా కొత్త వ్యక్తులు, గ్రూపులతో కనెక్ట్‌ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ ఫీచర్‌తో గోప్యత, భద్రత, నకిలీ ఖాతాలు, మోసాలు వంటి అంశాలపై వస్తున్న సందేహాలకు ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చింది. యూజర్‌నేమ్‌ను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సృష్టించాల్సిన అవసరం లేదని వాట్సాప్ తెలిపింది. ఇది పూర్తిగా వారి ఇష్టమని పేర్కొంది. కొన్ని యూజర్‌నేమ్‌లు ఎందుకు అందుబాటులో ఉండవు? ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లో ఇప్పటికే ఉన్న యూజర్‌నేమ్‌లు ఆయా ఖాతాదారుల కోసం రిజర్వ్‌ చేయబడతాయని వాట్సాప్ తెలిపింది. అలాగే ప్రముఖులు, ప్రభుత్వ సంస్థలు, సెలబ్రిటీలు, మెటా వెరిఫైడ్‌ ఖాతాలకు సంబంధించిన పేర్లు, వాటి వేరియేషన్లు కూడా దుర్వినియోగానికి గురి కాకుండా రక్షిస్తామని పేర్కొంది. ఒకవేళ సాధారణ పేరు ఇప్పటికే మరొకరు తీసుకున్నట్లయితే, ప్రత్యామ్నాయ యూజర్‌నేమ్‌లను సూచించే జనరేటర్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. తన యూజర్‌నేమ్‌కు దగ్గరగా మరో వ్యక్తి పేరు సృష్టించి మోసాలకు పాల్పడితే ఎలా అనే ప్రశ్నకు వాట్సాప్‌ స్పందించింది. యూజర్‌నేమ్‌లను సెర్చ్‌ చేసే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. యూజర్‌నేమ్‌ ఆధారంగా సందేశాలు పంపే ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత, కొత్త వ్యక్తి

క ద ర న ట స ల ఎక స వ ద కగ స ప ద చ న వ ట స ప Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in