కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసిన రాజ్యసభ సభ్యులు
Actor ProfilePolitician

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసిన రాజ్యసభ సభ్యులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసిన రాజ్యసభ సభ్యులు
Telugu Times25 Jul 2026
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసిన రాజ్యసభ సభ్యులు

ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన నలుగురు ఎంపీలు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడి (Kinjarapu Rammohan Naidu)ని కలిశారు. ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసిన భాస్యం రామకృష్ణ (Bhasyam Ramakrishna), చింతకాయల విజయ్ (Chintakayala Vijay), సాని సతీశ్ (Sani Satish), లింగమనేని రమేశ్ (Lingamaneni Ramesh) లను కేంద్రమంత్రి తన నివాసానికి ఆహ్వానించారు. వారిని రామ్మోహన్ నాయుడు సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ సర్కారు వెసులుబాటును వినియోగించుకుని రాష్ట్రాభివృద్ధిలో మరింత వేగం పెంచుదామన్నారు. రాజ్యసభ సభ్యులు ఎన్నికై పెద్దల సభలో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు

క ద రమ త ర ర మ మ హన న య డ న కల స న ర జ యసభ సభ య ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in