కొత్త హీరోతో వంద కోట్లకు
Actor ProfileActor

కొత్త హీరోతో వంద కోట్లకు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కొత్త హీరోతో వంద కోట్లకు పైగా సినిమా.. అభిషేక్ నామా స్పందనిదే
Chitrajyothy6 Sept 2026
కొత్త హీరోతో వంద కోట్లకు పైగా సినిమా.. అభిషేక్ నామా స్పందనిదే

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన ఎపిక్ ఫాంటసీ అడ్వెంచర్ విజువల్ వండర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. విరాట్ కర్ణ (Virat Karrna) హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన ఎపిక్ ఫాంటసీ అడ్వెంచర్ విజువల్ వండర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ (Nagabandham). నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు అభిషేక్ నామా (Abhishek Nama) మీడియాకు చిత్ర విశేషాలను తెలుపుతూ.. ఈ సినిమాలో హీరోగా విరాట్ కర్ణను ఎందుకు ఎంపిక చేసుకున్నాడనే విషయాన్ని వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘నిజానికి ఈ కథ అనుకున్నప్పుడు ఎవరితో చేయాలనే ఆలోచనే లేదు. మంచి కథ చెప్పడంపైనే నా దృష్టి అంతా ఉంది. కథ అంతా పూర్తయిన తర్వాత దానికి ఎవరు బాగా సరిపోతారో వారిని ఎంపిక చేశాం. నిజానికి ఈ కథ మొదలు పెట్టినప్పుడు వంద కోట్ల బడ్జెట్ అవుతుందని ఊహించలేదు. కొత్త నటుడితో సినిమా చేయాలని అనుకున్నాను. ఎందుకంటే ఇది కథ మీద నడిచే సినిమా. పెద్ద హీరో ఎవరైనా అయితే ముందే కొన్ని అంచనాలు ఉంటాయి. అందుకే కొత్త హీరో అయిన విరాట్ కర్ణను ఎంపిక చేసుకున్నాను. కథ గురించి చెప్పాలంటే.. పద్మనాభస్వామి ఆలయంలో వాల్ట్ బి ఎందుకు తెరవలేదనే విషయంలో చాలా చర్చలు జరిగాయి. దానిపై ఎన్నో కథలు కూడా ఉన్నాయి. ఆ గదిలోపల ఏముందనేది అందరికీ ఎంతో ఆసక్తికరం. నిజంగా ఆ గది తెరిస్తే