కొత్త’ సంచలనం
Actor ProfileActor

కొత్త’ సంచలనం

Total News1
Movie Updates0
Sources1
కొత్త’ సంచలనం
Eenadu15 Jun 2026
కొత్త’ సంచలనం

అరంగేట్రంలో కాబోవెర్డె అద్భుత ప్రదర్శన టైటిల్‌ ఫేవరెట్‌ స్పెయిన్‌తో మ్యాచ్‌ డ్రా అట్లాంటా ఒకవైపేమో ప్రపంచ మేటి జట్లలో ఒకటి.. దానికి ప్రపంచకప్‌ గెలిచిన చరిత్ర ఉంది.. ఈసారి టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన ఆ జట్టులో ఎటు చూసినా స్టార్లే. ఇంకోవైపేమో ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న జట్టు.. ఆ దేశం పేరు కూడా అభిమానులకు పెద్దగా తెలియదు.. అందులో అందరూ అనామక ఆటగాళ్లే. ఇలాంటి రెండు జట్ల మధ్య పోరంటే.. ఫలితంపై ఎలాంటి అంచనా ఉంటుందో చెప్పేదేముంది? ఆ పెద్ద జట్టు.. ఈ చిన్న జట్టును ఎంత తేడాతో కొడుతుందనే చూస్తారంతా! కానీ ప్రపంచకప్‌లో అరంగేట్ర మ్యాచ్‌ ఆడుతున్న జట్టు.. అవతలున్న మేటి జట్టును నిలువరిస్తే? ప్రత్యర్థికి ఒక్క గోలూ ఇవ్వకుండా మ్యాచ్‌ను డ్రాగా ముగిస్తే? ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో ఈ అనూహ్య ఫలితమే వచ్చింది సోమవారం. ఐరోపా దిగ్గజ జట్టు స్పెయిన్‌ను.. కాబోవెర్డె అనే పసికూన నిలువరించింది. ఫిఫా ప్రపంచకప్‌ 2026లో తొలి సంచలనం నమోదైంది. కేవలం 5 లక్షల జనాభా ఉన్న, తొలిసారి ఈ మెగా టోర్నీకి అర్హత సాధించిన కాబోవెర్డె.. మాజీ ఛాంపియన్‌ స్పెయిన్‌ను నిలువరించి ప్రకంపనలు రేపింది. కురసావ్‌ మీద జర్మనీలాగే, ప్రపంచకప్‌ అరంగేట్ర జట్టుపై గోల్స్‌ వర్షం కురిపించేస్తుందనుకున్న ఐరోపా ఛాంపియన్‌.. ఒక్కసారీ బంతిని నెట్‌లోకి పంపించలేకపోయింది. సోమవారం గ్రూప్‌-హెచ్‌లో కాబోవెర్డెతో ఆ జట్టు పోరు 0-0తో డ్రాగా ముగిసింది. మ్యాచ్‌లో ఎక్కువ శాతం (62) బంతిని తన అధీనంలోనే ఉంచుకున్నప్పటికీ గోల్‌ మాత్రం సాధించలేకపోయింది స్పెయిన్‌. ఆ జట్టు 27 సార్లు గోల్‌ ప్రయత్నాలు చేయగా.. ప్రత్యర్థి ఆరుసార్లే ప్రయత్నించింది. ఈ మ్యాచ్‌లో హీరో కాబోవెర్డె గోల్‌ కీపర్‌ వోజినానే. స్పెయిన్‌ ఆటగాళ్లు నేరుగా ఏడుసార్లు నెట్‌ను లక్ష్యంగా షాట్లు ఆడగా.. అందులో చాలా వాటిని అతను అద్భుతంగా అడ్డుకున్నాడు. మొత్తంగా కాబోవెర్డె తిరుగులేని డిఫెన్స్‌ స్పెయిన్‌కు చెక్‌ పెట్టింది. కొన్నిసార్లు స్పెయిన్‌కు అదృష్టం కూడా

క త త స చలన Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in