
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల మంజూరు కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్న వారికి తీపి కబురు చెప్పింది. కొత్తగా రెండు లక్షల పెన్షన్లు అందిస్తామని గత బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే, కొత్త పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం అమలు చేస్తున్న పెన్షన్ల పథకంలో బోగస్ లబ్దిదారులను ఏరి వేసే ప్రక్రియ వేగవంతం చేసింది. ఇక, కొత్తగా పెన్షన్ల మంజూరు పైనా నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో అర్హులైన ఒంటరి మహిళలకు వచ్చే నెల నుంచి పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి సీతక్క చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పట్టణాల్లో.. గ్రామీణ ప్రాంతాల్లో మార్గదర్శకాల మేరకు రూ 4 వేలు పెన్షన్ పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం తుది కసరత్తు ప్రారంభించింది. క్షేత్ర స్థాయిలో లబ్దిదారుల వివరాల సేకరణ పూర్తి చేసి.. ఈ నెలాఖరులోకా తుది ఆమోదం ఇచ్చే విధంగా కసరత్తు కొనసాగుతోంది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వివిధ కేటగిరీల కింద 42 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉండగా.. వారిలో నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా నిధులు పొందుతున్న వారు 19,04,239 మంది ఉన్నారు. తాజా నిర్ణయం మేరకు అధికారులు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి లైవ్ అథెంటికేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో అనర్హులను గుర్తించి, ఏరి వేత ప్రక్రియను ప్రభుత్వం వేగ వంతం చేసింది. వీరి విషయంలో అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.తెలుగు రాష్ట్రాల నుంచి వందేభారత్ స్లీపర్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్- షెడ్యూల్, ముహూర్తం..!!జూలై నుంచి పంపిణీ ప్రారంభం కాగా, వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు పెద్ద ఎత్తున అధికారులను ఆశ్రయిస్తున్నారు. తమకు కూడా పెన్షన్ పొందేందుకు అర్హత ఉందని, తమ పేర్లను కొత్తగా నమోదు చేయాలని వినతిపత్రాలు అందిస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం..

