కేతన్ మర్డర్ కేసు.. అరగంట ముందు ప్రియుడితో 'సీక్రెట్ కాల్
Actor ProfilePolitician

కేతన్ మర్డర్ కేసు.. అరగంట ముందు ప్రియుడితో 'సీక్రెట్ కాల్

📊 Box Office Collections
Total News4
Movie Updates0
Sources1
జైపుర్ లో విషాదం.. గోడ కూలడంతో ముగ్గురు కార్మికుల మృతి
Andhra Jyothy14 Aug 2026
జైపుర్ లో విషాదం.. గోడ కూలడంతో ముగ్గురు కార్మికుల మృతి

జైపుర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు సమాచారం. ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్‌

అయోధ్య విరాళాల కేసు నిందితుల తరఫున ఎవరూ వాదించొద్దు
Andhra Jyothy14 Aug 2026
అయోధ్య విరాళాల కేసు నిందితుల తరఫున ఎవరూ వాదించొద్దు

అయోధ్య విరాళాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల తరఫున ఏ న్యాయవాదీ కోర్టులో వాదించరాదని నిర్ణయించింది. బార్ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఇంటర్నెట్ డెస్క్: అయోధ్య

కేతన్ మర్డర్ కేసు.. అరగంట ముందు ప్రియుడితో 'సీక్రెట్ కాల్
Andhra Jyothy13 Aug 2026
కేతన్ మర్డర్ కేసు.. అరగంట ముందు ప్రియుడితో 'సీక్రెట్ కాల్

పుణెకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యకేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు ముందు సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరీతో ఫోన్‌లో మాట్లాడినట్టు అధికారుల దర్యాప్తులో తేలింది. ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర పుణెకు చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు అరగంట ముందు సియా గోయల్.. తన ప్రియుడు చేతన్ చౌదరీకి ఫోన్ చేసి రహస్యంగా మాట్లాడినట్టు కాల్ డీటెయిల్ రికార్డ్స్(CDR) ఆధారంగా అధికారులు కనుగొన్నారు. మొబైల్ ఫోన్ల ఫోరెన్సిక్ విశ్లేషణ, సీడీఆర్ పరిశీలనలో ఈ విషయం బయటపడినట్టు తెలిపారు. ఈ కాల్‌ను కుట్రకు సంబంధించిన అత్యంత కీలక డిజిటల్ ఆధారంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ సంభాషణలో కేతన్‌తో తానున్న ప్రాపర్ లొకేషన్‌ను ప్రియుడు చేతన్‌కు సియా తెలిపిందని, అక్కడ ఇతర పర్యాటకులెవరూ లేరని నిర్ధారించినట్లు అనుమానిస్తున్నారు. హత్యకు సంబంధించిన ప్రణాళికను దాచిపెట్టేందుకు మూడు నెలలుగా ఇరువురూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వేదికగా షేర్ చేసుకున్న మెసేజ్‌లు, వాయిస్ కాల్స్ వివరాలను తొలగించినట్లు అధికారులు గుర్తించారు. సదరు డేటాను సైబర్ నిపుణుల సాయంతో వెలికితీసేందుకు యత్నిస్తున్నట్టు తెలిపారు. తొలగించిన సమాచారం, లొకేషన్ వివరాలు, ఇంటర్నెట్ ఐపీ అడ్రస్‌లను పోల్చి చూసి.. ఈ కుట్రను నిరూపించే దిశగా ఆధారాలు సేకరిస్తున్నట్టు స్పష్టం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కేతన్, సియాలకు నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉంది. కానీ ఈ పెళ్లి తనకు ఇష్టం లేకపోవడంతో సియా.. జూన్ 18న లోహగడ్ కోటకు కేతన్‌ను తీసుకెళ్లి కొండపై నుంచి తోసి హతమార్చింది. ఈ కేసులో ఆమె ప్రియుడు చేతన్ చౌదరీ కూడా నిందితుడిగా ఉన్నాడు. కాగా.. మే నెలాఖరులోనే సియా ఈ హత్యకు ప్లాన్ చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. జూన్ 14న తొలిసారి కేతన్‌ను కొండపై నుంచి తోసేందుకు యత్నించగా.. అదృష్టవశాత్తూ కేతన్ తనను తాను కాపాడుకుని ప్రాణాలతో బయటపడ్డారని

అయోధ్య రామ మందిరం విరాళాల కేసు.. అత్యవసర విచారణకు నో చెప్పిన సుప్రీంకోర్టు
Andhra Jyothy13 Aug 2026
అయోధ్య రామ మందిరం విరాళాల కేసు.. అత్యవసర విచారణకు నో చెప్పిన సుప్రీంకోర్టు

అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగం కేసుపై ఇవాళ (సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసు అత్యవసర విచారణకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. కోర్టు సెలవుల తర్వాత కేసును రెగ్యులర్ బెంచ్ ముందు