కొడితే రక్తం కారింది.. స్కూల్ డేస్ లో వేధింపులు గుర్తుచేసుకుంటూ హీరోయిన్ ఎమోషనల్
Actor ProfileActor

కొడితే రక్తం కారింది.. స్కూల్ డేస్ లో వేధింపులు గుర్తుచేసుకుంటూ హీరోయిన్ ఎమోషనల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కొడితే రక్తం కారింది.. స్కూల్ డేస్ లో వేధింపులు గుర్తుచేసుకుంటూ హీరోయిన్ ఎమోషనల్
Asianet News Telugu25 Aug 2026
కొడితే రక్తం కారింది.. స్కూల్ డేస్ లో వేధింపులు గుర్తుచేసుకుంటూ హీరోయిన్ ఎమోషనల్

కన్నడ చిత్రం 'ముగిల్‌పేట'తో మనోరంజన్ రవిచంద్రన్ సరసన హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది కయాదు లోహర్. ఆ తర్వాత మలయాళం, తెలుగు, మరాఠీ భాషల్లో నటించింది. ఇటీవల విశ్వక్‌ సేన్‌తో `ఫంకీ` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా తన స్కూల్ రోజుల్లో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. స్కూల్‌కి వెళ్లేటప్పుడు కొందరు అబ్బాయిలు రోజూ వేధించేవారని, సహనం నశించి కోపంతో వాళ్లపై రాయి విసిరానని ఆమె చెప్పింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ, హింసాత్మకంగా ప్రవర్తించడం సరైంది కాదని ఆమె ఒప్పుకుంది. కానీ, నాటి పరిస్థితులు తనను అలా ప్రవర్తించేలా చేశాయని చెప్పింది. "ఎవరిపైనైనా రాయి విసిరి గాయపరచడం తప్పు. కానీ ఆ సమయంలో నాకు కలిగిన బాధ, నిస్సహాయత, కోపం నన్ను అలా రియాక్ట్ అయ్యేలా చేశాయి. నేను సాధారణంగా ప్రశాంతంగా ఉంటాను. కానీ ఎవరైనా తప్పు చేసినప్పుడు సైలెంట్‌గా ఉండకూడదు. వాళ్లకు తగిన సమాధానం ఇవ్వాలని నేను నమ్ముతాను," అని ఆమె చెప్పింది. కయాదు వ్యాఖ్యలతో, స్కూల్, పనికి వెళ్లే మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, వాటి పర్యవసానాలపై మరోసారి చర్చ మొదలైంది. కయాదు లోహర్ ప్రస్తుతం పలు క్రేజీ సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన 'ఇధయమ్ మురళి' జూలై 10న విడుదల కానుండగా, 'ఇమ్మోర్టల్' జూలై 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో జి.వి. ప్రకాష్ కుమార్ కూడా కీలక పాత్రలో నటించారు. కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, మరాఠీ భాషల్లో నటించిన కయాదు, ప్రస్తుతం 'ఐ యామ్ గేమ్', 'ఖలీఫా', 'ది ప్యారడైజ్' వంటి మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది. అలాగే సూర్యతో ఓ మూవీ చేస్తోంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించే ఈ మూవీకి టీజీ జ్ఞానవేల్‌ రూపొందిస్తున్నారు