
ఈ ఏడాది వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కారణంగా రద్దైంది. తాజాగా ఈ నెల 21న మరోసారి నీట్ పరీక్ష నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం.. ఈసారి భారీ ఎత్తున


ఈ ఏడాది వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కారణంగా రద్దైంది. తాజాగా ఈ నెల 21న మరోసారి నీట్ పరీక్ష నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం.. ఈసారి భారీ ఎత్తున

ఈ ఏడాది జాతీయ స్దాయిలో నిర్వహించిన పలు పోటీ పరీక్షలతో పాటు సాధారణ పరీక్షల్లో సైతం అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కీలకమైన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావడంతో 23 లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. ఈ నేపథ్యంలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విద్యార్ధులకు అండగా నిలవాలని నిర్ణయించారు. ఈ మేరకు దేశంలోని వివిధ నగరాల్లో ఆందోళనలు చేపట్టడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రాహుల్ నిర్ణయించారు.NEET 2026: నీట్ అభ్యర్ధులకు ఆర్టీసీ గుడ్ న్యూస్-ఉచిత బస్సులు, హెల్ప్ డెస్క్ లు..!ఇందులో భాగంగా జూన్ 17న రాజస్థాన్ లోని కోటాలో, జూలై 10న యూపీలోని ప్రయాగ్ రాజ్ లో, జూలై 11న బీహార్ లోని పాట్నాలో, జూలై 14న ఢిల్లీలో భారీ నిరసన సభలకు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. వీటిలో తొలి సభ అయిన కోటా నిరసన రేపు జరగనుంది. దీంతో కోటా సభకు భారీ ఎత్తున తరలివచ్చి తమకు మద్దతునివ్వాలని యువత, జెన్ జీకి రాహుల్ గాంధీ ఇవాళ ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. విద్యా వ్యవస్ధలో అక్రమాలపై దేశవ్యాప్తంగా వివిధ చోట్ల వినిపిస్తున్న ప్రతిధ్వనిని కోటాలో యుద్ధనినాదంగా మారుద్దామని రాహుల్ పిలుపునిచ్చారు. NEET Paper Leak 2026: మళ్లీ నీట్ పేపర్ లీక్ అయిందా ? నా యువ మరియు జెన్ జెడ్ మిత్రులారా, ఒక విషయం నా మనసులో స్పష్టంగా ఉంది, మీరు కూడా దానిని మీ హృదయాల్లో చెక్కించుకోవాలి: భారతదేశంలోని ప్రతి యువత భవిష్యత్తును సురక్షితం చేయడం ప్రభుత్వ బాధ్యత.కానీ బాధ్యత మరియు నిజాయితీ-ఈ రెండూ మోడీ ప్రభుత్వ ఆలోచనా విధానానికి అందనివి. పేపర్ లీకులు, పరీక్షల నిర్వహణలో అవకతవకలు, రద్దు చేయబడిన నియామకాలు, ఆకాశాన్నంటుతున్న ఫీజులు, ప్రైవేటీకరణ, కుంభకోణాలు-ప్రతిరోజూ లక్షలాది కలలను నాశనం చేయడానికి అది ఉపయోగిస్తున్న సాధనాలు ఇవే. గుర్తుంచుకోండి, యువత భవిష్యత్తు దేశ