కోట్లతో తీస్తే 70 కోట్ల వసూళ్లు.. థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్
Actor ProfileActor

కోట్లతో తీస్తే 70 కోట్ల వసూళ్లు.. థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్

Total News1
Movie Updates0
Sources1
కోట్లతో తీస్తే 70 కోట్ల వసూళ్లు.. థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్
TV9 Telugu17 Jun 2026
కోట్లతో తీస్తే 70 కోట్ల వసూళ్లు.. థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా చాలా రోజుల తర్వాత సోలో హీరోగా నటించిన చిత్రం బ్లాస్ట్. మే 28న ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. కేవలం మౌత్ టాక్ తోనే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు రికార్డు వసూళ్లు వచ్చాయి. ఇప్పటికీ థియేటర్లలో ఆడుతోన్న బ్లాస్ట్ సినిమాకు రూ. 70 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడీ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. బ్లాస్ట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జూన్ 25 నుంచి అర్జున్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రానున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో ఒకేసారి ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ అయినప్పటికీ త్వరలోనే బ్లాస్ట్ ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. బ్లాస్ట్ సినిమాకు సుభాష్ కె రాజ్ అనే కుర్రాడు దర్శకత్వం వహించాడు. అతనికి ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. చిత్రంలో అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ కీలక పాత్రలు పోషించారు. ఇక బ్లాస్ట్ సినిమా కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. అయితేనేం బాక్సాఫీస్ వద్ద ఏకంగా ఏకంగా రూ. 70 కోట్లకు వసూళ్లు సాధించింది. తద్వారా నిర్మాతలకు , డిస్ట్రిబ్యూటర్లకు బ్లాస్ట్ మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో హీరో అర్జున్ యాక్షన్ విన్యాసాలతో పాటు అభిరామి, ప్రీతి ముకుందన్ కరాటే ఫైట్స్ హైలెట్ గా నిలిచాయి. యాక్షన్ మూవీ లవర్స్ చూడాలనుకునేవారికి బ్లాస్ట్ ఫుల్ మీల్స్ అందించిందని చెప్పవచ్చు. మరి మీరు ఈ యాక్షన్ థ్రిల్లర్