
కాక్‌టెయిల్2(Cocktail2) రిలీజ్‌కు ముందే టీజర్, ట్రైలర్‌లలో కనిపించిన స్టైలిష్ విజువల్స్, విదేశీ లొకేషన్లు, గ్లామరస్ ప్రెజెంటేషన్‌తో మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. అయితే సినిమా రిలీజైన తర్వాత కథ కంటే ఎక్కువగా చర్చకు వచ్చిన అంశం దీనికి లభించిన A సర్టిఫికేట్. చాలా మంది ఆడియన్స్ సినిమా చూసే వరకు దీనికి అడల్ట్స్ ఓన్లీ సర్టిఫికేట్ వచ్చిందనే విషయాన్ని కూడా గమనించలేదు. ముఖ్యంగా 2012లో వచ్చిన ఒరిజినల్ కాక్‌టెయిల్ తరహాలోనే ఇది కూడా ఒక రిలేషన్‌షిప్ డ్రామా అనుకుని U/A లేదా U/A 16+ సర్టిఫికేట్ వస్తుందని చాలామంది భావించారు. కానీ CBFC తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. సినిమా చూసిన తర్వాత కొంతమంది ఆడియన్స్ ఈ సినిమాకు A సర్టిఫికేట్ అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రిలీజైన కొన్ని సినిమాల్లో మరింత బోల్డ్ కంటెంట్, గ్లామర్, ఇంటిమేట్ సీన్స్ ఉన్నప్పటికీ తక్కువ పరిమితులున్న సర్టిఫికేట్లు లభించాయని వారు గుర్తుచేస్తున్నారు. అదే సమయంలో మరో వర్గం మాత్రం CBFC నిర్ణయాన్ని సమర్థిస్తోంది. వారి అభిప్రాయం ప్రకారం సర్టిఫికేషన్ అనేది కేవలం స్కిన్ షో లేదా రొమాంటిక్ సీన్స్ ఆధారంగా కాకుండా సినిమాలో ప్రస్తావించిన అంశాలు, సంబంధాలపై చూపించిన దృక్పథం, భావోద్వేగ సంఘర్షణల తీవ్రతను కూడా పరిగణనలోకి తీసుకుని నిర్ణయిస్తారు. కాక్‌టెయిల్2లో నమ్మకం, రిలేషన్‌షిప్ టెస్టులు, సంక్లిష్టమైన వ్యక్తిగత బంధాల వంటి అంశాలు ఉండటమే A సర్టిఫికేట్‌కు కారణమై ఉండొచ్చని వారు అంటున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన చర్చ కూడా సాగుతోంది. కొందరు నెటిజన్లు A సర్టిఫికేట్‌ను ఒకరకంగా ప్రమోషనల్ టూల్‌గా ఉపయోగించి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. గతంలో కొన్ని సినిమాలు వివాదాలు, సెన్సార్ చర్చల ద్వారా ఎక్స్‌ట్రా బజ్ ను సొంతం చేసుకున్న ఉదాహరణలను వారు ప్రస్తావిస్తున్నారు. అయితే ట్రేడ్ వర్గాలు మాత్రం ఈ వాదనను పెద్దగా పట్టించుకోవడం లేదు. వారి మాటల్లో సర్టిఫికేట్