
కస్టోడియల్ మరణాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితులను కస్టడీలో కొట్టి చంపడం పోలీసుల 'అధికారిక విధి' కాదని తేల్చి చెప్పింది. నిందితులైన పోలీసులను శిక్షించేందుకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. ఇండోర్: కస్టోడియల్ మరణాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితులను కస్టడీలో కొట్టి చంపడం పోలీసుల 'అధికారిక విధి' కాదని తేల్చి చెప్పింది. నిందితులైన పోలీసులను శిక్షించేందుకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇండోర్ జిల్లా కోర్టు ఉద్యోగి పంకజ్ వైష్ణవ్ కస్టోడియల్ డెత్ కేసులో పోలీసుల పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ గజేంద్ర సింగ్ సంచలన ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా కస్టోడియల్ మరణాలపై హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. కస్టోడియల్ మరణాలు సభ్య సమాజంలో అత్యంత ఘోరమైన నేరాలని మధ్యప్రదేశ్ హైకోర్టు అభిప్రాయపడింది. థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, రికార్డులు ఫోర్జరీ చేయడం పోలీసుల విధి నిర్వహణ కిందికి రావని ఈ సందర్భంగా పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల ముందస్తు అనుమతి నిబంధన (Sanction) ఈ కేసులో వర్తించదని వెల్లడించింది. భోపాల్ ఎయిమ్స్ ఆస్పత్రి పోస్టుమార్టం నివేదికలో బాధితుడిపై పోలీసుల హింస నిజమేనని తేలిందని కోర్టు ప్రస్తావించింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పోలీసులకు రక్షణ కవచాలు ఉండవని స్పష్టం చేసింది. విచారణకు ముందస్తు అనుమతి అవసరం లేదన్న కోర్టు తీర్పుతో నిందితులైన పోలీసులపై విచారణకు మార్గం సుగమమైంది. ఇండోర్‌లోని జిల్లా కోర్టులో క్లాస్-IV ఉద్యోగిగా పంకజ్ వైష్ణవ్ (24) పని చేసేవారు. 2015 డిసెంబర్లో ఓ స్కూటర్ దొంగతనం చేసినట్లు వైష్ణవ్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు డిసెంబర్ 19న ఇండోర్‌లోని ఎంఐజీ పోలీస్ స్టేషన్‌కు అతన్ని తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి పోలీసుల అదుపులో ఉండగానే వైష్ణవ్ ప్రాణాలు కోల్పోయాడు. విచారణ సందర్భంగా వైష్ణవ్‌ను పోలీసులు విపరీతంగా కొట్టడంతోనే మృతిచెందినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ