కష్టం వస్తేనే నమ్మకం పెరుగుతుంది
Actor ProfileActor

కష్టం వస్తేనే నమ్మకం పెరుగుతుంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కష్టం వస్తేనే నమ్మకం పెరుగుతుంది
Telugu Cinema31 Jul 2026
కష్టం వస్తేనే నమ్మకం పెరుగుతుంది

ఒక నటిగా కెరీర్‌లో ఎదురయ్యే ఒడిదొడుకులు, కష్టకాలమే ఓపికను, తనపై తనకు నమ్మకాన్ని నేర్పించిందని చెబుతోంది హీరోయిన్ త్రిప్తి దిమ్రి (Triptii Dimri). ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమని, మనం ఒకటి ఆశిస్తే అక్కడ మరొకటి జరుగుతుందని అంటోంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మన సామర్థ్యంపై మనకే అనుమానాలు వస్తుందని, కానీ ఓపిగ్గా ఉండాలని సూచిస్తోంది. సినిమా రంగంలో ఎదురయ్యే సవాళ్ల గురించి మాట్లాడుతూ పై విధంగా స్పందించింది త్రిప్తి. ఎంతటి కష్టం ఎదురైనా, భయపడకుండా తలదించుకుని మన పనిని మనం సిన్సియర్‌గా చేస్తే, విజయం ఏదో ఒక రోజు వరిస్తుందని చెబుతోంది. నటన అనేది కేవలం వృత్తి మాత్రమే కాదని, వెండితెరపై తాను చేసే ఒక్కో క్యారెక్టర్ ద్వారా ఒక్కో కొత్త జీవితాన్ని జీవించే అద్భుతమైన అవకాశం దొరుకుతోందని అంటోంది త్రిప్తి. నిజ జీవితంలో మనం చేయలేని ఎన్నో సాహసాలను, అనుభవించలేని ఎమోషన్స్‌ను కెమెరా ముందుకు వచ్చి పాత్రల ద్వారా అనుభవించే వీలుంటుందని అంటోంది. ‘యానిమల్’ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది త్రిప్తి దిమ్రి. అదే జోష్‌తో ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన స్పిరిట్ (Spirit) సినిమా చేస్తోంది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబో‌లో వస్తున్న ఈ సినిమా త్రిప్తి దిమ్రి కెరీర్‌ను సౌత్ ఇండస్ట్రీలో మరో స్థాయికి తీసుకెళ్తుందని అంతా భావిస్తున్నారు

కష ట వస త న నమ మక ప ర గ త ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in