
Eenadu•31 Jul 2026
కష్టాలను దాటి.. నిరుపేద యువకులను తీర్చిదిద్దుతున్న అథ్లెట్ఆయన ఓ అథ్లెట్. చిన్నప్పటి నుంచి కష్టం విలువ తెలిసిన మనిషి. అందుకే వెన్నుపూస గాయంతో కదల్లేని స్థితికి చేరినా పట్టుదలను వీడలేదు. సాహసమే శ్వాసగా మళ్లీ పరుగు తీశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 72 పతకాలు సాధించారు. క్రీడాకారుడిగా, ఆర్టీసీ కండెక్టర్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయనే విశాఖ జిల్లాకు చెందిన రాంబాబు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే.. పేద క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఆయన వద్ద శిక్షణ పొందిన 80 మందికి పైగా యువకులు ఆర్మీ, రైల్వే, పోలీస్ వంటి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించారు. అథ్లెట్ రాంబాబు స్ఫూర్తిదాయ ప్రయాణంపై ప్రత్యేక కథనం.. ఈ వార్త చదివారా: నాన్న కోసం నేర్చుకుని..నేడు దేశానికి పతకాలు